కందగిరి కొండపై భక్తుల కిటకిట

కందగిరి కొండపై భక్తుల కిటకిట
  • కుటుంబ సమేతంగా కందికొండపైకి భక్తులు

మహబూబాబాద్ జిల్లా: కందికొండ జాతరకు భక్తులు పోటెత్తారు. కురవి మండలంలో మూడు కిలోమీటర్ల ఎత్తులో కందగిరి కొండపై వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. కుటుంబ సమతేంగా స్వామి వారిని దర్శించుకొని పూజలు చేస్తున్నారు. మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజు జాతర నిర్వహిస్తారు. అయితే ఈ సారి చంద్రగ్రహణం రావడంతో  ఇవాళ జాతర నిర్వహిస్తున్నారు. కొండపై ఉన్న కోనేటిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారి దర్శనానికి వెళ్తున్నారు. 

కరోనా కారణంగా రెండేళ్లపాటు జాతర నిర్వహించలేదు. దీంతో ఈ ఏడాది జాతరకు ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు..రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. కొండపైన వెలసిన 200 ఏళ్ల నాటి ఆలయంలో కొలువైన లక్ష్మినరసింహస్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.