వైభవంగా ఛట్ పూజలు

వైభవంగా ఛట్ పూజలు

దేశవ్యాప్తంగా ఛట్ పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రధానంగా యూపీ, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఛట్ పూజలు వైభవంగా కొనసాగుతున్నాయి. యూపీలో సీఎం యోగి ఆదిత్యనాథ్ జ్యోతి ప్రజ్వలన చేసి ఛట్ ఉత్సవాలను ప్రారంభించారు. ఇది సూర్యదేవుడిని పూజించే పూజ కావడంతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈనెల 28న ప్రారంభమైన ఉత్సవాలు రేపటితో ముగియనున్నాయి.

ఛట్ పూజను ఏటా కార్తీకమాసంలో నిర్వహిస్తుంటారు. ఛట్ పూజను దళ ఛట్, ఛతి, సూర్య షష్ఠి అని కూడా అంటారు.  మన ప్రాచీన పండుగల్లో ఛట్ పూజ ఒకటి. భూమ్మీద తమకు మనుగడ కల్పిస్తున్న సూర్యభగవానుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఆయురారోగ్య, ఆనందాలను ప్రసాదించమని ఈ పూజను నిర్వహిస్తారు. సూర్యున్ని ఆరాధించడం వల్ల కుష్టు వంటి దీర్ఘకాలిక వ్యాధులు కూడా నయమవుతాయని నమ్ముతారు. మనదేశంలో ఉత్తరాదిన ఈ ఛట్ పూజ ఎక్కువగా జరుపుకుంటారు.