ఘనంగా అంజన్న నగర సంకీర్తన

ఘనంగా అంజన్న నగర సంకీర్తన

నర్సంపేట/ ముగులు, వెలుగు : హనుమాన్​మాలధారణ భక్తులు స్వామివారి నగర సంకీర్తన కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. నర్సంపేట టౌన్​లో శివాంజనేయ స్వామి ఆలయం, ములుగు సీతారామాంజనేయ స్వామి, కోదండ రామాలయాల హనుమాన్​భక్త మండలి ఆధ్వర్యంలో మాలధారణ భక్తులు నగర సంకీర్తన చేశారు.

ఊరేగింపు కార్యక్రమం భజన కీర్తలతో మార్మోగింది. భక్తులు మంగళహారతులతో స్వామివారి రథానికి పూజలు చేశారు. అనంతరం ఆయా ఆలయాల ప్రాంగణంలో మహా అన్నదానం చేపట్టారు. కార్యక్రమంలో మాలధారణ భక్తులు పాల్గొన్నారు.