
కొడిమ్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన వెల్మ నరసింహారెడ్డి దేశవ్యాప్తంగా ఆలయాలను సందర్శనకు సైకిల్ పై యాత్రను చేపట్టారు. సుమారు 22,000 కిలో మీటర్ల మేర యాత్ర కొనసాగిస్తున్నారు. వెంకటేశ్వర స్వామి భక్తుడైన ఆయన కొద్ది రోజుల కింద ప్రారంభించిన సైకిల్ యాత్ర సోమవారం కొడిమ్యాలకు చేరుకుంది.
నరసింహారెడ్డి ఏడాది కింద త్రిదండి చిన్న జీయర్ స్వామి వద్ద శిష్యరికం చేసి తన పేరును నరసింహ రామానుజ దాసన్ గా మార్చుకున్నాడు. ఏడాదికాలంగా సైకిల్ పైన దేశంలోని ప్రముఖ ఆలయాలను సందర్శిస్తూ సోమవారం సొంతూరుకు చేరుకున్నాడు. ఈ సందర్భంగా మండలంలోని ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.