
న్యూఢిల్లీ: భారత్ బయోటెక్ తయారు చేసిన ఇంట్రానాసల్ బూస్టర్ డోస్ ఇన్‌కొవాక్ వినియోగానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీజీసీఐ) శుక్రవారం పర్మిషన్ ఇచ్చింది. కొవాగ్జిన్ లేదా కొవిషీల్డ్ రెండు డోసులు వేసుకున్నప్పటికీ 18 ఏండ్లు దాటినోళ్లకు అత్యవసర పరిస్థితిలో బూస్టర్ డోసుగా ఈ వ్యాక్సిన్‌ను వాడేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
ఇన్‌కొవాక్ బూస్టర్ డోస్ మనదేశంలో తయారైన మొదటి ఇంట్రానాసల్ వ్యాక్సిన్. ఇప్పటివరకు 3 దశల్లో సక్సెస్‌ఫుల్‌గా క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకున్న ఈ టీకాను డాక్టర్, సూదితో పనిలేకుండా ఎవరైనా ఎప్పుడైనా ముక్కులోంచి స్ర్పే చేసుకునేలా భారత్ బయోటెక్ కంపెనీ తయారు చేసింది. ఇది కరోనా వైరస్‌ను అడ్డుకోవడంతో పాటు, వైరస్ వ్యాప్తి జరగకుండా కాపాడుతుందని కంపెనీ తెలిపింది. రెండు డోసులు వేసుకున్న 6 నెలల తర్వాత బూస్టర్ డోసుగా నాసల్
వ్యాక్సిన్ వినియోగించనున్నారు.