డీజీపీకి రాని ఎమ్మెల్యే సీటు కానిస్టేబుల్‌కు వచ్చింది

డీజీపీకి రాని ఎమ్మెల్యే సీటు కానిస్టేబుల్‌కు వచ్చింది

డీజీపీకి టికెట్​ దక్కలె.. కానిస్టేబుల్‌కు కలిసొచ్చింది

చివరి నిమిషంలో చేతులెత్తేసిన అధికార పార్టీ

బీహార్​ ఎలక్షన్స్.. పొత్తులో వేరే పార్టీకి దక్కిన సీటు

పాట్నా(బీహార్): ఆయనో డీజీపీ.. ఎలక్షన్ల నిలబడాలని ఉద్యోగానికి రాజీనామా చేసిండు. పార్టీ కండువా కూడా కప్పుకున్నడు, అన్నీ రెడీ చేసుకున్నడు. తీరా చూస్తే పార్టీ ప్రకటించిన కేండిడేట్ల లిస్ట్​లో ఆయన పేరు లేదు. అదే నియోజకవర్గం టికెట్​ను వేరే పార్టీ నుంచి ఓ కానిస్టేబుల్​ దక్కించుకున్నడు. సోషల్​ మీడియాలో వైరల్​గా మారిన ఈ ఘటన వివరాలు.. బీహార్  డీజీపీ గుప్తేశ్వర్​ పాండే నెల క్రితం వాలంటరీ రిటైర్మెంట్​ తీసుకున్నడు. ఎన్నికల్లో నిలబడేందుకు  జేడీయూ చీఫ్​ నితీశ్​ను కలిసి పార్టీలో చేరిండు. తన సొంతూరు బక్సర్​ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తానని చెప్పడంతో టికెట్​ ఇవ్వడానికి నితీశ్​కూడా ఓకే అన్నరు. ఇక్కడి వరకూ అంతా బాగానే ఉంది, ఆ తర్వాతే కథ అడ్డం తిరిగింది. బీహార్​ ఎన్నికల్లో నితీశ్​ కుమార్​ పార్టీ జేడీయూ, బీజేపీ ఉమ్మడిగా పోటీ చేస్తున్నాయి. సీట్ల పంపకాల్లో సదరు బక్సర్​ సీటు కాస్తా బీజేపీకి వెళ్లింది. ఆ సీటును సర్దుబాటు చేయలేక, వేరే చోట టికెట్ ఇవ్వలేక జేడీయూ చేతులెత్తేసింది. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికే ఉన్న ఉద్యోగాన్ని కూడా వదులుకొని వచ్చిన మాజీ డీజీపీ దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. ఇదిట్లుంటే.. అదే బక్సర్ ​సీటును దక్కించుకున్న బీజేపీ పరుశురామ్ చతుర్వేది అనే మాజీ కానిస్టేబుల్​ను బరిలో దింపింది. దీంతో పాండే మరింత ఇరకాటంలో పడ్డారు. తెలిసినోళ్లు, తెలియనోళ్లు ఫోన్లు చేసి సానుభూతి చెప్పడం భరించలేకపోయారు. కొన్ని రోజులు నాకెవరూ ఫోన్​ చేయకండ్రా బాబూ అని ఫేస్​బుక్​లో రిక్వెస్ట్​ చేసిండు. టికెట్​ రేసులో మాజీ డీజీపీని ఓడించిన మాజీ కానిస్టేబుల్​ అంటూ బయ ట ప్రచారం జరుగుతుండగా.. మాజీ కానిస్టేబుల్​ పరుశురామ్​ చతుర్వేది మాత్రం పాండే సాబ్​ నాకు పెద్దన్నలాంటోడు, ఆయనంటే నాకెప్పుడూ పూజ్యభావమే అంటూ తన అభిమానాన్ని చాటుకున్నడు.

For More News..

బాలికతో ఫ్రెండ్‌‌‌‌షిప్ చేస్తుండని కొట్టి చంపిన్రు