AP Elections: కౌంటింగ్ పై స్పెషల్ ఫోకస్.. డీజీపీ కీలక నిర్ణయం..

AP Elections: కౌంటింగ్ పై స్పెషల్ ఫోకస్.. డీజీపీ కీలక నిర్ణయం..

ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. ప్రస్తుతం ఎన్నికల ఫలితాల కోసం అంతా ఎదురుచూస్తున్నారు. జూన్ 4న కౌంటింగ్ జరగనున్న క్రమంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పోలింగ్ అనంతరం రాష్ట్రంలో పలు చోట్ల జరిగిన ఘర్షణలు కలకలం రేపిన నేపథ్యంలో ఎన్నికల సంఘంతో పాటు పోలీస్ శాఖ కూడా కౌంటింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ క్రమంలో ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కీలక నిర్ణయం తీసుకున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు ప్రత్యేక పోలీస్ అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు డీజీపీ హరీష్  కుమార్.మొత్తం 56మంది ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పోలింగ్ అనంతరం తీవ్ర ఘర్షణలు జరిగిన పల్నాడు జిల్లాకు 8మంది ప్రత్యేక అధికారులను నియమించారు.కౌంటింగ్ సందర్బంగా కఠిన ఆంక్షలు అమల్లో ఉంటాయని, కౌంటింగ్ కేంద్రాల వద్ద అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు అధికారులు.