యాదగిరీశుడి సేవలో డీజీపీ శివధర్ రెడ్డి

యాదగిరీశుడి సేవలో డీజీపీ శివధర్ రెడ్డి

 యాదగిరిగుట్ట, వెలుగు:  యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని డీజీపీ శివధర్ రెడ్డి కుటుంబసభ్యులు ఆదివారం దర్శించుకున్నారు. డీజీపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఆయన గుట్టకు వచ్చారు.  ముందుగా  యాదాద్రి కలెక్టర్ హనుమంతరావు  స్వాగతం పలికారు. అనంతరం తూర్పు రాజగోపురం నుంచి త్రితల గోపురం గుండా ఆలయంలోకి ప్రవేశించిన ఆయనను ఆలయ ప్రధానార్చకులు పూర్ణకుంభంతో స్వాగతించారు. గర్భగుడిలో లక్ష్మీసమేత నారసింహుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రధానాలయ ముఖ మంటపంలో అర్చకులు వేదాశీర్వచనం చేశారు. కలెక్టర్ లడ్డూ ప్రసాదం, స్వామివారి శేషవస్త్రాలు అందజేశారు. ఆలయ ఏఈవోలు గజవెల్లి రఘు, జూశెట్టి కృష్ణ గౌడ్, నవీన్ కుమార్ యాదగిరిగుట్ట ఆలయ నమూనా ఫొటోను బహూకరించారు. డీసీపీ ఆక్షాంశ్ యాదవ్, ఆర్డీవో కృష్ణారెడ్డి, ఏసీపీ శ్రీనివాస్ నాయుడు, తహసీల్దార్ గణేశ్​ నాయక్, సీఐ భాస్కర్ ఉన్నారు