అజయ్ దేవగన్ నుంచి వస్తున్న కామెడీ ఎంటర్‌టైనర్ ‘ధమాల్ 4’ . సూపర్ హిట్ కామెడీ ఫ్రాంచైజీ ‘ధమాల్’లో వస్తున్న నాలుగో చిత్రమిది. రితేజ్ దేశ్‌ముఖ్, అర్షద్ వర్సీ, జావెద్ జఫ్రీ, రవి కిషన్, సంజయ్ మిశ్రా, ఈషా గుప్తా, అంజలి ఆనంద్, సంజీదా షేక్, ఉపేంద్ర లిమాయే ఇతర
ముఖ్యపాత్రలు పోషించారు. ఈ ఫిల్మ్ సిరీస్‌లో వచ్చిన గత మూడు చిత్రాలను తెరకెక్కించిన ఇంద్ర కుమార్ దీనికి కూడా దర్శకత్వం వహించారు.
మంగళవారం ఈ చిత్రంలో నటిస్తున్న పాత్రలను పరిచయం చేస్తూ పోస్టర్స్ విడుదల చేశారు. హ్యూమర్, అడ్వెంచర్ కలగలిసిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇదని అర్థమవుతోంది. టీ సిరీస్‌తో కలిసి అజయ్ దేవగన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జులై 17న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేసిన మేకర్స్.. వారం ముందుగానే అంటే జులై 10నే రిలీజ్‌కు రెడీ చేస్తున్నట్టు సమాచారం.
