వచ్చే ఏడాది ఫిబ్రవరి 17న ధమ్కీ మూవీ విడుదల

వచ్చే ఏడాది  ఫిబ్రవరి 17న ధమ్కీ మూవీ  విడుదల

విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేస్తోన్న ప్యాన్ ఇండియా మూవీ ‘దాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కా ధమ్కీ’. నివేదా పేతురాజ్ హీరోయిన్. విశ్వక్ తండ్రి కరాటే రాజు నిర్మిస్తున్నారు. ఇటీవల టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఇంప్రెస్ చేసిన విశ్వక్, తాజాగా రిలీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అనౌన్స్ చేశాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 17న విడుదల చేయబోతున్నట్టు గురువారం ప్రకటించారు.

నిజానికి ఫిబ్రవరి రిలీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అని ఇప్పటికే చెప్పిన టీమ్, నిన్న డేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రివీల్ చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో విశ్వక్ లుక్ ఆకట్టుకుంటోంది. షూటింగ్ పూర్తయిన ఈ మూవీకి సంబంధించి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. యాక్షన్, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌ తో కూడిన రోమ్-కామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రూపొందిస్తున్నారు. ప్రసన్న కుమార్ బెజవాడ డైలాగ్స్ రాయగా, లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నాడు. రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి, పృథ్వీరాజ్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.