సునీల్, ధన్ రాజ్ కాంబినేషన్ లో ‘బుజ్జీ.. ఇలా రా’

సునీల్, ధన్ రాజ్ కాంబినేషన్ లో ‘బుజ్జీ.. ఇలా రా’

ధన్ రాజ్, సునీల్ లీడ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘బుజ్జీ.. ఇలా రా’. చాందిని తమిళరసన్ హీరోయిన్ గా నటించింది. జి.నాగేశ్వరరెడ్డి కథ, స్క్రీన్ ప్లే రాశారు. సినిమాటోగ్రాఫర్ ‘గరుడవేగ’ అంజి డైరెక్ట్ చేశారు. అగ్రహారం నాగిరెడ్డి, సంజీవరెడ్డి నిర్మాతలు. ఆగస్టు 19న మూవీ విడుదల కానుంది. రీసెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా అల్లరి నరేష్ ట్రైలర్ ను లాంచ్ చేశాడు. అనంతరం నరేష్​ మాట్లాడుతూ ‘నాకు సీమశాస్త్రి, సీమ టపాకాయ్ లాంటి విజయాలు అందించారు నాగేశ్వరరెడ్డి. ఆయన కథ ఇచ్చారంటే కచ్చితంగా మ్యాజిక్ ఉంటుంది. ‘గరుడవేగ’లాంటి సినిమాలో అద్భుతమైన కెమెరా వర్క్ అందించారు అంజి. అంత మంచి టెక్నీషియన్ దర్శకుడు కావడం, నాగేశ్వరరెడ్డి స్క్రిప్ట్ అందించడం చూస్తే థియేటర్స్ లో థ్రిల్ గ్యారంటీ అనిపిస్తోంది’ అన్నాడు.  

‘నాది సీరియస్ రోల్. సునీల్ ఈ చిత్రానికి బ్యాక్ బోన్’ అన్నాడు ధనరాజ్. ‘నాకీ అవకాశమిచ్చిన నాగేశ్వరరెడ్డి గారికి, నిర్మాతలకు  జీవితాంతం రుణపడి ఉంటాను. సీట్ ఎడ్జ్ థ్రిలర్ ఇది.  అందర్నీ ఆకట్టుకుంటుంది’ అన్నారు అంజి. ‘ఈ సినిమా విజయం సాధిస్తే అంజికి మంచి పేరు రావాలి. ఆడకపోతే మాత్రం చెడ్డ పేరు నాకు రావాలని కోరుకుంటున్నాను’ అన్నారు నాగేశ్వరరెడ్డి. నిర్మాతలతో పాటు శ్రీకాంత్ అయ్యంగార్, సాయి కార్తీక్ కూడా పాల్గొన్నారు.