ధనుష్ లేటెస్ట్ మూవీ ‘సార్’ పోస్టర్ రిలీజ్

ధనుష్ లేటెస్ట్ మూవీ ‘సార్’ పోస్టర్ రిలీజ్

తమిళ స్టార్ హీరో ధనుష్.. హీరోగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ద్విభాషా చిత్రం ‘‘ సార్’’ పోస్టర్ ను చిత్ర బృందంను దీపావళి కానుకగా రిలీజ్ చేసింది. తమిళ్ లో ‘వాతి’ పేరుతో తెరకెక్కుతున్న ఈ మూవీని  సితార ఎంటర్టైన్మెంట్స్ రూపొందిస్తోంది.

తమిళంలో ధనుష్ నటించిన దాదాపు అన్ని సినిమాలు డబ్బింగ్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరుతున్నాయి. ధనుష్ సినిమాలకు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉండడంతో మేకర్స్ ఈ సినిమాను తమిళంతోపాటు తెలుగులోనూ చిత్రీకరిస్తున్నారు. దీపావళి సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో హీరో ధనుష్ నీలి రంగు చొక్కా ధరించి ఫైట్ చేస్తున్న ధనుష్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. దీపావళి పండగ విశిష్టతను తెలియజేస్తూ చెడుపై మంచి విజయం అని తెలిపేలా ఉంది పోస్టర్.

వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సంయుక్త మీనన్ కథానాయిక. కాలేజీ బ్యాక్ డ్రాప్ తో నిర్మిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలుండడంతో  త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య ఈ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.  

అలాగే సితార ఎంటర్ టైన్ మెంట్ నిర్మిస్తున్న మరో చిత్రం ' బుట్ట బొమ్మ ' పోస్టర్ ను కూడా విడుదల చేశారు. అనిఖా సురేంద్రన్, సూర్య వశిష్ట, అర్జున్ దాస్ పాత్రలలో కూడిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి శౌరి చంద్రశేఖర్ టి.రమేష్ దర్శకుడు.