ఇళయరాజా బయోపిక్‌‌‌‌ లాంచ్

ఇళయరాజా బయోపిక్‌‌‌‌ లాంచ్

ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును అందుకున్నాడు ధనుష్. ఇప్పుడు ఓ రియల్‌‌‌‌ లైఫ్‌‌‌‌ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌ను అతను పోషించబోతున్నాడు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా పాత్రలో ధనుష్ కనిపించబోతున్నాడు. బుధవారం చెన్నైలో ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ఇళయరాజా, ధనుష్‌‌‌‌తోపాటు  కమల్ హాసన్ ముఖ్య అతిధిగా హాజరై  టైటిల్ పోస్టర్ లాంచ్ చేశారు. ఈ పోస్టర్‌‌‌‌‌‌‌‌ గమనిస్తే..  చెన్నై రోడ్ల మీద ఇళయరాజా హార్మోనియం పెట్టె పట్టుకొని అవకాశాల కోసం ఎదురుచూస్తున్నట్టు ఉంది.

ఇళయరాజా గెటప్‌‌‌‌లో  ధనుష్ వెనుక నుంచి రెట్రో లుక్‌‌‌‌లో ఇంప్రెస్ చేస్తున్నాడు. ఒక సామాన్యుడిగా మొదలై.. తన సంగీతంతో కోట్లాదిమందిని అభిమానులుగా చేసుకున్న మ్యూజిక్ మ్యాస్ట్రో జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం అనేలా పోస్టర్‌‌‌‌‌‌‌‌ను డిజైన్ చేయడం, అలాగే  ‘ద కింగ్ ఆఫ్ మ్యూజిక్’ అనే క్యాప్షన్‌‌‌‌ ఇవ్వడం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. రీసెంట్‌‌‌‌గా ధనుష్‌‌‌‌తో ‘కెప్టెన్ మిల్లర్’ తెరకెక్కించిన అరుణ్ మాథేశ్వరన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళ,  తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేయనున్నారు.

ఈ సందర్భంగా ధనుష్​ మాట్లాడుతూ ‘ఇళయరాజా సర్ బయోపిక్ చేస్తున్నందుకు గర్వంగా ఉంది. నేను లైఫ్‌‌‌‌లో ఇద్దరి బయోపిక్‌‌‌‌లు తీయాలని అనుకున్నాను. ఒకటి ఇళయరాజా సర్, రెండు సూపర్ స్టార్ రజినీకాంత్’ అని చెప్పాడు.  ఇక ఈ సినిమాలో చాలామంది తమిళ, తెలుగు స్టార్లు గెస్ట్ అప్పీరెన్స్ ఇస్తారని సమాచారం.  కనెక్ట్ మీడియా, మెర్క్యూరీ గ్రూప్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.