ముషీరాబాద్ లో కూతురి డెడ్ బాడీతో అల్లుడి ఇంటి ముందు ధర్నా

ముషీరాబాద్ లో కూతురి డెడ్ బాడీతో అల్లుడి ఇంటి ముందు ధర్నా

ముషీరాబాద్, వెలుగు: అత్తింటి వేధింపులతోనే తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని పేర్కొంటూ ఆమె డెడ్​బాడీతో కుటుంబ సభ్యులు మంగళవారం ఆందోళన చేపట్టారు. చిక్కడపల్లి పోలీసులు, మృతురాలి బంధువుల వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం అనంత కూడుకు చెందిన మల్లయ్య, సత్యమ్మ దంపతుల పెద్ద కూతురు శ్రీలత(33)ని బాగ్​లింగంపల్లి సంజయ్​నగర్​లో ఉండే గడ్డం సాగర్ కు ఇచ్చి 9 ఏండ్ల క్రితం పెండ్లి జరిపించారు. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే, పెళ్లయిన కొద్ది కాలం నుంచే శ్రీలతను భర్త, అత్త వేధిస్తుండేవారు. 

ఐదు నెలల క్రితం శ్రీలత పుట్టింటికి వెళ్లి కొద్దిరోజులు అక్కడే ఉంది. పిల్లలను చూచేందుకు అత్తారింటికి వెళ్లడంతో వారు పిల్లలను చూడనీయలేదు. దీంతో మనస్తాపం చెందిన శ్రీలత పుట్టింటికి వెళ్లి సోమవారం రాత్రి ఉరేసుకొని సూసైడ్​ చేసుకుంది. భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం శ్రీలక్ష్మి డెడ్​బాడీతో సంజయ్​నగర్​కు వెళ్లిన ఆమె కుటుంబ సభ్యులు సాగర్ ​ఇంటిముందు బైఠాయించారు. తమ కుమార్తెకు న్యాయం జరగాలని  ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు కలగజేసుకొని సర్దిచెప్పడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు.