శ్రీ చైతన్య కాలేజ్పై చర్యలు తీసుకోవాలి: ఏబీవీపీ నాయకులు

శ్రీ చైతన్య కాలేజ్పై చర్యలు తీసుకోవాలి: ఏబీవీపీ నాయకులు

శ్రీ చైతన్య కాలేజ్ గేటు ముందు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. విద్యార్థి గౌతమ్ మృతిపై విచారణ జరిపి.. చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. కాలేజ్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన ఏబీవీపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. 

 
  
రంగారెడ్డి జిల్లా బొంగులూరు శ్రీ చైతన్య ఐఐటీ అకాడమీలో విద్యార్థి గౌతమ్(15) ఆగస్టు 14 సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విద్యార్థి మరణానికి కారణమైన శ్రీ చైతన్య కళాశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కళాశాల లోపలికి వెళ్లేందుకు ఏబీవీపీ నాయకులు ప్రయత్నించగా... పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఏబీవీపీ నాయకులు కాలేజ్ గేటు ముందు కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. వారందరిని పోలీసులు అరెస్ట్ చేసి.. ఆదిభట్ల పోలీస్ స్టేషన్ కు తరలించారు. 

ALSO READ :తహశీల్దారు కార్యాలయంలోకి గొర్రెలను తోలారు

కార్పొరేట్ కళాశాలలు కేవలం విద్యార్థులను బలి చేయడానికే పెట్టారని ఏబీవీపీ జిల్లా నాయకుడు కందాడి శ్రీరామ్ మండిపడ్డారు. వారానికొక్క విద్యార్థి కార్పొరేట్ కళాశాలల్లో మృతి చెందుతుంటే..  విద్యాశాఖ, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా విద్యార్థుల మరణాలపై తగు విచారణ జరిపి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే  కార్పొరేట్ కాలేజ్ లకు వ్యతిరేకంగా పోరాడుతామని హెచ్చరించారు.