చీమలకుంటపల్లిలో దళితబంధు రాలేదని ధర్నా

చీమలకుంటపల్లిలో దళితబంధు రాలేదని ధర్నా

గన్నేరువరం, వెలుగు: దళితబంధు అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు, లీడర్లకే ఇచ్చారని, అర్హులకు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ కరీంనగర్​జిల్లా గన్నేరువరం మండలం చీమలకుంటపల్లిలో గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. సోమవారం దళిత మహిళలు, యువకులు గ్రామంలో ర్యాలీ నిర్వహించి జీపీ ముందు బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు అర్హులకు అందడం లేదని బీఆర్ఎస్​ కార్యకర్తలకే అందజేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం అర్హులను గుర్తించి దళిత బంధు అమలు చేయాలని, లేనిపక్షంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు.

దళితబంధులో పేదలకు అన్యాయం

ధర్మపురి, వెలుగు: దళిత బంధు పథకంలో అర్హులకు న్యాయం జరగడం లేదని ఆరోపిస్తూ సోమవారం ధర్మపురి తహసీల్​ఆఫీస్ ముందు బీజేపీ, కాంగ్రెస్ లీడర్లు వేర్వేరుగా నిరసన తెలిపారు. జగిత్యాల డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి మర్రిపల్లి సత్యం మాట్లాడుతూ పేదలకు ఇవ్వాల్సిన దళితబంధు బీఆర్ఎస్ లీడర్లు, కార్యకర్తలకే ఇస్తున్నారని ఆరోపించారు.అర్హులైన దళితులను మంత్రి కొప్పుల మోసం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.