
బర్మింగ్‌హామ్/నాటింగ్‌హామ్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ శని, ఆదివారాల్లో ఇండియా, ఇంగ్లండ్ టీ20 మ్యాచ్‌లకు హాజరై సందడి చేశాడు. రెండో టీ20 సందర్భంగా ధోనీ.. యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఫేస్ మాస్కు ముఖానికి పెట్టుకొని స్టేడియంలోకి వచ్చాడు. స్టాండ్స్‌లో పంత్‌తో ఫొటోకు పోజిచ్చిన మహీ.. తర్వాత ఇండియా డ్రెస్సింగ్ రూమ్‌లోకి వచ్చాడు. స్పిన్నర్ చహల్ తో పాటు యంగ్‌స్టర్ ఇషాన్ కిషన్‌కు టిప్స్ ఇచ్చాడు. ఆదివారం కూడా స్టేడియానికి వచ్చి న ధోనీ.. మాజీ కోచ్ రవిశాస్త్రితో మాట్లాడుతూ కనిపించారు.