Anupama Parameswaran: యంగ్ హీరోతో అనుప‌మ రొమాన్స్..ఛాలెంజింగ్ రోల్లో కొత్త మూవీ

Anupama Parameswaran: యంగ్ హీరోతో అనుప‌మ రొమాన్స్..ఛాలెంజింగ్ రోల్లో కొత్త మూవీ

తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో తనదైన యాక్టింగ్ తో కుర్రాళ్ళ గుండెల్లో గుబులు రేపుతున్న బ్యూటీ అనుపమ పరమేశ్వరన్‌ (Anupama Parameswaran). చాలా రోజుల నుంచి ఈ బ్యూటీకి సరైన అవకాశాలు రాకపోవడంతో..పనై అయిపోందంటూ వినిపిస్తోన్న కామెంట్స్ లో నిజం లేదంటూ వరుస సినిమాల్లో నటిస్తోంది.

త్వరలో డీజే సిద్దుతో టిల్లూ స్క్వేర్ రిలీజ్కు రెడీ అయింది. ఈ మూవీలో తన క్యారెక్టర్ కు అందరు ఫిదా అవ్వాల్సిందే అంటూ ఆసక్తి రేపింది.అంతేకాకుండా డబుల్ డోస్ రొమాన్స్ తో కుర్రాళ్లను లైన్ లో పెట్టేసింది. ఈ సినిమాలే కాకుండా మలయాళం, తమిళ్ అనుపమ మూవీస్ చేయనుంది. 

లేటెస్ట్గా అనుపమ యంగ్ హీరోతో రొమాన్స్ చేయడానికి రెడీ అయింది. త‌మిళంలో చియాన్ విక్ర‌మ్ త‌న‌యుడు ధృవ్ విక్ర‌మ్‌తో ఓ మూవీకి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది ఈ అమ్మడు.ఈ మూవీని ఉధ‌య‌నిధి స్టాలిన్ నటించిన మామ‌న్న‌న్ తెరకెక్కించిన డైరెక్ట‌ర్ మారి సెల్వ‌రాజ్ డైరెక్ట్ చేయబోతున్నాడు. ఇవాళ మార్చి 12న ఈ సినిమా అఫీషియ‌ల్‌గా అనౌన్స్ ఇచ్చారు మేకర్స్. 

క‌బ‌డ్డీ బ్యాక్‌డ్రాప్‌లో స్పోర్ట్స్ డ్రామాగా, సోషల్ ఇస్స్యూ తో తెర‌కెక్క‌నున్న ఈ సినిమాలో  అనుపమ ఛాలెంజింగ్ రోల్లో క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. తండ్రి చియాన్ విక్ర‌మ్‌తో క‌లిసి మ‌హాన్ సినిమాలో అద్భుతమైన యాక్టింగ్ తో అదరగొట్టిన ధృవ్ విక్రమ్ ఈ సినిమాతో స్టార్ హీరో ఖాతాలో పడటం కన్ఫమ్ అంటూ తమిళ సినీ సర్కిల్ లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు కబాలి డైరెక్టర్ పా రంజిత్ నిర్మించ‌బోతున్నాడు.