ఐపీఎల్ టైటిల్ ను తొలిసారి గెలిచి ట్రోఫీ కలను నెరవేర్చుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును అధికారికంగా అమ్మకానికి పెట్టారు. ఐపీఎల్ మెన్స్, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రస్తుత యజమానులైన డియాజియో ఇప్పటికే అమ్మక ప్రక్రియను ప్రారంభించింది. మార్చి 31, 2026 నాటికి అమ్మకాన్ని పూర్తి చేయగలమని నమ్మకంగా ఉంది. వచ్చే ఏడాది మార్చి 31 తర్వాత ఐపీఎల్‌లో ఆర్సీబీ కనిపించదనే వార్తలు వస్తున్నాయి. ఓనర్లు ఆర్సీబీ జట్టును సేల్‌కు పెట్టిన వార్తలు నిజమే అయినట్టు తెలుస్తోంది. బయ్యర్ దొరికితే మార్చి 31, 2026 నాటికి ఆర్సీబీ పేరు మారే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ప్రస్తుతం ఆర్సీబీ బ్రాండ్ వ్యాల్యూ రూ. 2,247 కోట్లు. ఆర్సీబీని కొనుగోలు చేసేందుకు పలువురు బడా వ్యాపార వేత్తలు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఫ్రాంచైజీని అమ్మకానికి పెడితే RCBని కొనుగోలు చేయడానికి చాలా ఆసక్తిగల పార్టీలు ఉన్నాయి. USలోని ఒక ప్రైవేట్ పెట్టుబడి సంస్థ ఆసక్తి చూపిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. JSW గ్రూప్ కూడా రేస్ లో ఉంది. అదానీ గ్రూప్, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు చెందిన అదార్ పూనవాలా, దేవయాని ఇంటర్నేషనల్ గ్రూప్ కు చెందిన రవి జైపురియా కూడా ఆర్‌సిబిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.
యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ మాతృ సంస్థ డియాజియో, RCB కోసం దాదాపు USD 2 బిలియన్ల విలువను కోరుతున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. మార్చి 31, 2025తో ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం లాభంలో స్పోర్ట్స్ వ్యాపారం 8.3 శాతం వాటాను కలిగి ఉంది. వ్యాక్సిన్ కింగ్ అదార్ పూనవాలా స్పోర్ట్స్ వ్యాపారాన్ని భద్రపరచడానికి ఆసక్తి చూపుతున్నట్లు నివేదికలు ఉన్నాయి. ఈ అమ్మకం మార్చి 31, 2026 నాటికి పూర్తవుతుందని అంచనా వేయగా, ఫ్రాంచైజీ ఆటగాళ్ల కోసం వేలం వేయడం మరియు నవంబర్ 27న WPL వేలంలో పాల్గొనడం కనిపిస్తుంది.
మార్చి 31 నాటికి ఆర్సీబీ జట్ల అమ్మకం పూర్తయితే మరో పేరుతో ఆర్సీబీ జట్టు బరిలోకి దిగే అవకాశం ఉంది. 2008 నుండి ఐపీఎల్ లో భాగమైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18 ఏళ్ళ తర్వాత తొలిసారి టైటిల్ గెలుచుకుంది. మహిళలలో 2024 ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకున్నారు. విరాట్ కోహ్లీ, స్మృతి మంధాన, జోష్ హాజిల్‌వుడ్ లాంటి స్టార్ ఆటగాళ్లు ఆ జట్టులో ఉన్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉంది. ఒక్కసారి టైటిల్ గెలవకపోయినా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్‌లతో జట్లతో సమానంగా బ్రాండ్ వాల్యూ కలిగి ఉంది.
