సర్కార్ దవాఖాన్లలో పాడైతున్న డయాగ్నస్టిక్ మెషీన్లు

సర్కార్ దవాఖాన్లలో పాడైతున్న డయాగ్నస్టిక్ మెషీన్లు

 

వెలుగు నెట్ వర్క్ / హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ దవాఖాన్లలో డయాగ్నస్టిక్ మెషీన్లు మూలకు పడుతున్నాయి. రిపేర్లకు నోచుకోక, టెక్నీషియన్లు లేక రూ.లక్షలు పెట్టి కొన్న మెషీన్లు నిరుపయోగంగా మారుతున్నాయి. చాలా చోట్ల వాటిని వాడకంలోకి తేవాలన్న ఆలోచన కూడా చేయకుండా, టెస్టుల కోసం రోగులను బయటకు పంపిస్తున్నారు. ఫలితంగా రోగి జేబుకు చిల్లు తప్పట్లేదు. కరీంనగర్ జిల్లా ఆస్పత్రికి నిత్యం వందల మంది వస్తుంటారు. ఇక్కడ డిజిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రే మెషీన్ పనిచేయట్లేదు. దానికి రిపేర్ చేయించకుండా మూలన పడేశారు. ఇదే దవాఖానలో ఆపరేషన్​ థియేటర్ స్టెరిలైజ్ చేసే ఆటో ఫ్లేవ్ పనిచేయడం లేదు. జనగామ జిల్లా హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కోట్లు పెట్టి కొన్న సీటీ స్కాన్ మూలకు పడింది. 3 ఏండ్ల నుంచి దీనికి రిపేర్లు చేయించకుండా, నిరుపయోగంగా ఉంచుతున్నారు. ఇన్ని ఏండ్ల తర్వాత రిపేర్లు చేయించినా, అది నడుస్తుందన్న గ్యారంటీ లేదని ఆస్పత్రి సిబ్బంది చెప్తున్నారు. రిపేర్లు చేయించకుండా, అన్ని సేవలు జిల్లా హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే అందించాలంటే ఎట్ల సాధ్యం అవుతుందని అక్కడి డాక్టర్లు ప్రశ్నిస్తున్నారు. మెదక్ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏడాది నుంచి సీ ఆర్మ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెషీన్ పనిచేయడం లేదు. ఆర్థోపెడిక్ సర్జరీలకు అత్యవసరమైన ఈ యంత్రమే రిపేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉండడంతో ఆర్థోపెడిక్ ఆపరేషన్లు అవసరమైన వారిని, ప్రమాదాలకు గురయి బోన్ ఫ్రాక్చర్లతో వస్తున్న బాధితులను హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రిఫర్ చేస్తున్నారు.

టెక్నీషియన్లు లేరని..

బర్రెను కొని తలుగు కొనడం మర్చినట్టు, లక్షలు పోసి కొన్న మెషీన్లు నడిపేందుకు టెక్నీషియన్లను నియమించకుండా సర్కారు నిర్లక్ష్యం చేస్తోంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 2 ఏండ్ల కిందట ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రే మెషీన్ కొనుగోలు చేశారు. టెక్నీషియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నియమించకపోవడంతో ఈ మెషీన్ ఖాళీగానే ఉంటుండడం ఆఫీసర్ల నిర్లక్ష్యానికి నిదర్శనం. ఇదే ఆస్పత్రిలో కంటి చికిత్సకు సంబంధించిన మరో మెషీన్ కూడా టెక్నీషియన్ లేడని మూలన పెట్టేశారు. నిర్మల్ జిల్లా ఆస్పత్రిలో ఖరీదైన ఆల్ట్రాసౌండ్ మెషీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్నప్పటికీ, దాన్ని నడిపే టెక్నీషియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేడని ఖాళీగా ఉంచుతున్నారు. ఈ దవాఖానకు వచ్చే రోగులను, ప్రెగ్నెంట్లను స్కానింగ్ కోసం ప్రైవేటు హాస్పిటళ్లకు రిఫర్ చేస్తున్నారు. భద్రాచలం ఏరియా హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో స్కానింగ్ మెషీన్ ఉన్నా, రేడియాలజిస్ట్ లేక మెషీన్ నిరుపయోగంగా మారింది. రోగులను స్కానింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల కోసం ప్రైవేటుకు పంపి కమీషన్లు  దండుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. 

ఖాళీగా ఇంజనీర్లు.. 

ప్రభుత్వ దవాఖాన్లలో మెషీన్ల రిపేర్లకు బయోమెడికల్ ఇంజరీనింగ్ విభాగం కూడా ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ఈ విభాగం యాక్టివ్ గా ఉండేది. తెలంగాణ వచ్చాక దీనిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. సీనియర్ బయోమెడికల్ ఇంజనీర్లను పనిలేని పోస్టుల్లోకి మార్చారు. కొత్త వారిని రిక్రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడం ఆపేసి, ప్రైవేటు సంస్థలకు మెషీన్ల రిపేర్ల బాధ్యతలు అప్పగించారు. వంద కోట్ల మెషినరీ ఉంటే, ఐదొందల కోట్ల మెషినరీ ఉన్నట్టు చూపి చెన్నైకి చెందిన ఫేబర్ సింధూరి అనే అనామక కంపెనీకి కాంట్రాక్ట్ కట్టబెట్టారు. ఈ కాంట్రాక్ట్ ప్రకారం మెషీన్ల మొత్తం వాల్యూలో(రూ.500 కోట్లు), ఏడాదికి 5.7 శాతం చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో ఈ ఒప్పందం జరిగింది. అయితే, మెషీన్లకు రిపేర్లు చేయలేక ఆ సంస్థ చేతులెత్తయడంతో దాదాపు సగం యంత్రాలు మూలకు పడ్డాయి. ఈటల రాజేందర్ హెల్త్ మినిస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్నప్పుడు ఫేబర్ సింధూరి కంపెనీ కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రద్దు చేశారు.

తయారీ కంపెనీకే రిపేర్ల బాధ్యతలు  

హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు హెల్త్ మినిస్టర్ అయినంక, మెషీన్ల రిపేర్ల కోసం ఇటీవలే ఓ కొత్త పాలసీని ప్రకటించారు. మెషీన్లు తయారు చేసిన కంపెనీకే రిపేర్ల కాంట్రాక్ట్ కూడా ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకు మెషీన్లు కొనేటప్పుడే సదరు కంపెనీతో ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఉన్న మెషీన్లను కూడా ఇదే పద్ధతిలో రిపేర్ చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీని వల్ల యంత్రాల విడి భాగాలకు ఇబ్బంది ఉండదని, రిపేర్లు కూడా త్వరగా అవుతాయని భావిస్తున్నారు.