భారత్ దెబ్బకు దుకాణం సర్దిన టెర్రరిస్టులు.. పీవోకే నుంచి తట్టాబుట్టా సర్దుకుని పాకిస్తాన్‎కు పరార్ ..!

భారత్ దెబ్బకు దుకాణం సర్దిన టెర్రరిస్టులు.. పీవోకే నుంచి తట్టాబుట్టా సర్దుకుని పాకిస్తాన్‎కు పరార్ ..!

న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్‎ పేరుతో ఉగ్రవాదులను చావు దెబ్బకొట్టింది భారత్. పాకిస్థాన్‎తో పాటు పాకిస్థాన్ అక్రమిత కాశ్మీర్ (పీవోకే)లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా భారత్ మెరుపు దాడులు చేపట్టింది. పాకిస్థాన్‎లోకి చొచ్చుకెళ్లి మిస్సైళ్లు, డ్రోన్లతో విరుచుకుపడింది ఇండియన్ ఆర్మీ. పెద్ద మొత్తంలో ఉగ్రవాదులు చనిపోవడంతో పాటు టెర్రరిస్ట్ ట్రైనింగ్ క్యాంపులు ఎక్కడికక్కడ నేలమట్టం అయ్యాయి. 

ఆపరేషన్ సిందూర్ దెబ్బకు పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న కరుడుగట్టిన టెర్రిరస్ట్ గ్రూపులు జైష్-ఎ-మొహమ్మద్ (జెఎం), హిజ్బుల్ ముజాహిదీన్ తమ స్థావరాలను మారుస్తున్నాయని భారత రక్షణ, సైనిక వర్గాల ద్వారా తెలిసింది. టెర్రరిస్ట్ క్యాంపులను పీవోకే నుంచి ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‎కు తరలిస్తున్నట్లు సమాచారం. వ్యూహత్మక మార్పులో భాగంగానే పీవోకే నుంచి ఉగ్రవాదులు తమ దుకాణం సర్దేస్తున్నారని తెలుస్తోంది. ఎందుకంటే పీవోకేలో భారత సైన్యం అత్యంత కచ్చిత్వంతో దాడులు చేయడమే.

పీవోకేపై భారత సైన్యానికి మంచి పట్టు ఉండటంతో ఇక ఇక్కడ తమ ఆటలు సాగవని టెర్రరిస్టులు ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‎కు వెళ్తున్నారంట. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ ఆప్ఘాన్‎కు సరిహద్దుల్లో ఉండటంతో పాటు ఇక్కడ దాడులు చేయడం ఇండియాకు కొంచెం రిస్క్‎తో కూడుకున్న పని. అందుకే తమ సేఫ్ హౌజ్‎లను, టెర్రరిస్ట్ క్యాంపులను ఉగ్రవాదులు ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‎కు నిఘా వర్గాల సమాచారం.