AA22xA6: క్రేజీ ఆఫర్.. అల్లు అర్జున్‌తో కింగ్‌‌డమ్‌‌ హీరోయిన్.. అట్లీ సెట్ చేసిన ఐదుగురు హీరోయిన్స్ వీళ్లే!

AA22xA6: క్రేజీ ఆఫర్.. అల్లు అర్జున్‌తో కింగ్‌‌డమ్‌‌ హీరోయిన్.. అట్లీ సెట్ చేసిన ఐదుగురు హీరోయిన్స్ వీళ్లే!

గతేడాది ‘మిస్టర్ బచ్చన్’చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే.. ప్రస్తుతం వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది. ఫస్ట్ మూవీ రిజల్ట్ మాటెలా ఉన్నా.. తనదైన గ్లామర్‌‌‌‌తో అందర్నీ ఆకట్టుకుంది భాగ్యశ్రీ. దీంతో ఆమె బ్యాక్ టు బ్యాక్ బంపర్ ఆఫర్స్ అందుకుంటోంది.

ఇప్పటికే రామ్‌‌తో ఓ మూవీ, దుల్కర్ సల్మాన్‌‌కు జంటగా ‘కాంత’సినిమాలో నటిస్తోంది. అలాగే విజయ్ దేవరకొండతో ‘కింగ్‌‌డమ్‌‌’చేస్తోంది. వీటితోపాటు సూర్యకు జోడీగా ఓ తమిళ మూవీలోనూ సెలెక్ట్ అయ్యిందని సమాచారం.

తాజాగా మరో క్రేజీ ఆఫర్ అందుకుందట భాగ్యశ్రీ బోర్సే. అల్లు అర్జున్‌‌ సినిమాలో ఆమె చాన్స్ దక్కించుకుందని టాక్ వినిపిస్తోంది. బన్నీ హీరోగా అట్లీ దర్శకత్వంలో రీసెంట్‌‌గా ఓ ప్రాజెక్టును అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

ఇందులో ఐదుగురు హీరోయిన్స్ నటించబోతున్నారని, ఇప్పటికే జాన్వీ కపూర్, అనన్య పాండే, మృణాల్ ఠాకూర్‌, దీపికా పదుకునే ‌‌లను టీమ్ ఫైనల్ చేసిందని ప్రచారం జరిగింది. మరో హీరోయిన్‌‌గా భాగ్యశ్రీని సెలెక్ట్ చేశారట. ఈ క్రేజీ ప్రాజెక్టులో ఆమె జాయిన్ అయితే తన ఇమేజ్ మరింత పెరగడం ఖాయంగా తెలుస్తోంది. ఈ హీరోయిన్స్‌‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇకపోతే ఈ భారీ బ‌డ్జెట్ మూవీలో అల్లు అర్జున్ రోల్ మూడు డిఫ‌రెంట్ షేడ్స్‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. పాజిటివ్‌తో పాటు నెగెటివ్ రోల్స్‌తో అల్లు అర్జున్ క‌నిపిస్తాడ‌ని ప్ర‌చారం. ఒక పాత్ర హీరో, రెండవది విలన్, మరియు మూడవది పూర్తి నిడివి గల యానిమేటెడ్ పాత్ర అని టాక్. త్వరలో ఈ విషయంపై క్లారిటీ రానుంది. 

Sun Pictures 🤝 @alluarjun 🤝 @Atlee_dir

Crossing Borders. Building Worlds. 💥🔥#AA22xA6 - A Magnum Opus from Sun Pictures💥

🔗 - https://t.co/NROyA23k7g#AA22 #A6 #SunPictures pic.twitter.com/2Cr3FGJ9eM

— Sun Pictures (@sunpictures) April 8, 2025

ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది ఆఖరిలో రెగ్యులర్  షూటింగ్ స్టార్ట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇంట‌ర్నేష‌న‌ల్ స్టాండ‌ర్డ్స్‌తో రూపొందుతోన్న ఈ భారీ బ‌డ్జెట్ మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్‌‌పై కళానిధి మారన్ ‌‌నిర్మిస్తున్నారు.