డిఫరెంట్ ​థీమ్స్.. 1000 హోళీ ఈవెంట్స్

డిఫరెంట్ ​థీమ్స్.. 1000 హోళీ ఈవెంట్స్

హైదరాబాద్, వెలుగు:  హోళీ పండుగను గ్రాండ్​గా సెలబ్రేట్ చేసుకునేందుకు సిటీ సిద్ధమైంది. ఈ నెల 25న డిఫరెంట్​థీమ్స్ తో స్పెషల్​హోళీ ఈవెంట్లు నిర్వహించేందుకు ఆర్గనైజర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈవెంట్లకు సంబంధించి టికెట్లను బుక్ మై షో, పేటీఎంలో అందుబాటులో ఉంచారు. సిటీలోని కె.కన్వెన్షన్​సెంటర్లో ‘రంగ్ దే హైదరాబాద్’ పేరుతో ఓపెన్ ఎయిర్ హోళీ ఈవెంట్ ప్లాన్​చేశారు. ఇందులో సింగర్‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌‌‌‌‌ సిప్లిగంజ్ తన మ్యూజిక్ కాన్సెర్ట్ తో అలరించనున్నాడు. 

వెస్లీ డిగ్రీ కాలేజీలో ర్యాప్​సింగర్​రోల్​రైడాతో మ్యూజిక్ కాన్సెర్ట్ ఏర్పాటు చేశారు. ఇందులో కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. కొండాపూర్​నోవాటెల్‌‌‌‌‌‌‌‌లో సింగర్​రామ్​మిరియాలతో మ్యూజిక్ కాన్సెర్ట్​ఏర్పాటు చేస్తున్నారు. క్లౌడ్​డైనింగ్​అరేనాలో హైదరాబాద్ బిగ్గెస్ట్ హోళీ కార్నివల్, సికింద్రాబాద్​ఇంపీరియల్ గార్డెన్స్​లో కలర్ బ్లూమ్స్, జలవిహార్ వాటర్ పార్క్ లో ఖేలే హోళీ, నాంపల్లి ఎగ్జిబిషన్​గ్రౌండ్స్ లో కలర్ ల్యాండ్ హోళీ, సంధ్యా కన్వెన్షన్​లో హోళీ మొహల్లా పేరుతో ఈవెంట్లు ప్లాన్​చేశారు. 

థీమ్స్, అక్కడి వెరైటీలను బట్టి టికెట్ రేట్లు రూ.199 నుంచి మొదలవుతున్నాయి. ఆర్గానిక్ కలర్స్ ను అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు. ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు, కొలీగ్స్ తో వచ్చి ఎంజాయ్ చేయొచ్చని, అన్ని ఏర్పాట్లు చేశామని చెబుతున్నారు. ఉదయం 8  నుంచి మధ్యాహ్నం 3 వరకు ఈవెంట్లు  జరగనున్నాయి.