వైరా, వెలుగు: చనిపోయిన తర్వాత దహనసంస్కారాలు నిర్వహించేందుకే వెళ్లే దారిలో కూడా ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. పట్టణంలోని హనుమాన్ బజార్ రెండో వార్డులో ఒకరు చనిపోగా.. శ్మశాన వాటికు వెళ్లే దారి అధ్వాన్నంగా ఉండటంతో ఇబ్బందులు తప్పలేవు.
ముళ్ళకంపలు, మురుగునీరు దాటుతూ శ్మశానానికి వెళ్లాల్సి వచ్చింది. ప్రభుత్వాలు ఎన్ని మారిన ఈ సమస్య మాత్రం ఇంతవరకూ తీరలేదు. అధికారులకు అర్జీ పెట్టుకున్నా ప్రయోజనం లేదని పోయిందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.