తిరుమలగిరిలో యూనిట్లు పెట్టుకున్న లబ్ధిదారుల కష్టాలు

తిరుమలగిరిలో యూనిట్లు పెట్టుకున్న లబ్ధిదారుల కష్టాలు

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం మామిడాలకు చెందిన తడకమళ్ల మల్లేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఓ ఫార్మసీ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. ఇతడు దళితబంధు స్కీంకు ఎంపిక కావడంతో జాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మానేసి గ్రామంలో మెడికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టుకునేందుకు అప్లై చేసుకున్నాడు. దీనికి కావాల్సిన అన్ని అనుమతులతో పాటు, గ్రామంలోనే ఓ ఇంటిని రెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తీసుకున్నాడు. షాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అవసరమైన అన్ని పేపర్లు సబ్మిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడంతో దళితబంధు కింద అతడి అకౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ. 1.50 లక్షలు డిపాజిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. నాలుగు నెలలు గడిచినా మిగిలిన అమౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాకపోవడంతో తిరిగి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లి జాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జాయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యాడు. షాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం తీసుకున్న ఇంటికి ఇప్పటివరకు రెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కడుతూనే ఉన్నాడు.

సూర్యాపేట, వెలుగు : ‘దళితుల అభివృద్ధి కోసం లక్ష కోట్లైనా ఖర్చు చేస్తాం.. వారు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతోనే దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టాం’ అని అధికార పార్టీ లీడర్లు ప్రతి మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చెబుతున్నారు. కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. ఆర్భాటంగా పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వం అందుకు అవసరమైన నిధులను మాత్రం విడుదల చేయడం లేదు. దీంతో స్వయం ఉపాధి పొందాలనుకునే యువతకు నిరాశే మిగులుతోంది. 

పైలట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కింద తిరుమలగిరి ఎంపిక

దళితబంధు పథకానికి పైలట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కింద సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలాన్ని ఎంపిక చేస్తున్నట్లు గతేడాది సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 1న ప్రభుత్వం ప్రకటించింది. ఈ మండలంలో ఉన్న మొత్తం ఎస్సీ ఫ్యామిలీలకు రూ. 10 లక్షల చొప్పున ఇస్తామని చెప్పింది. ఇందులో భాగంగా మొదటి విడతగా రూ. కోట్లను విడుదల చేసింది. దీంతో లబ్ధిదారుల గుర్తింపును ప్రారంభించిన ఆఫీసర్లు మొత్తం 2,503 మంది ఎస్సీలు ఉండగా 2,060 మంది దళితబంధు స్కీంకు అర్హులు ఉన్నట్లు తేల్చారు. యూనిట్ల ఎంపికపై అవగాహన కల్పించేందుకు మండలంలోని ప్రతి గ్రామానికి నోడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నియమించారు. వీరు ఆరు నెలల పాటు లబ్ధిదారులకు వివిధ యూనిట్లపై అవగాహన కల్పించారు. మొదటి విడతలో భాగంగా 1,975 మంది లబ్ధిదారులకు రూ.1.50 లక్షల చొప్పున అకౌంట్లలో వేశారు. 284 మంది వెహికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం అప్లై చేసుకోగా వారికి పూర్తిస్థాయిలో మంజూరు అయ్యాయి. అయితే మెడికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షాపు, డెయిరీ ఫామ్, జనరల్ స్టోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం అప్లై చేసుకున్న వారు రెంటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అగ్రిమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సబ్మిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తేనే డబ్బులు ఇస్తామని కండిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టారు.

ఖాళీ షాపులకు రెంట్లు కడుతున్న లబ్ధిదారులు

వివిధ రకాల షాపులు పెట్టుకోవాలనుకునే వారు రెంటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అగ్రిమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకోవాలని ఆఫీసర్లు చెప్పడంతో మండల వ్యాప్తంగా 1,691 మంది నాలుగు నెలల క్రితం అగ్రిమెంట్లు చేసుకున్నారు. ఫర్నీచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం కొటేషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా సిద్ధం చేసుకొని అన్ని డాక్యుమెంట్లను ఆఫీసర్లకు అందజేశారు. అయితే ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో నిధులు రాకపోవడంతో ఆఫీసర్లు యూనిట్ల గ్రౌండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆపేశారు. దీంతో నాలుగు నెలలుగా సొంత డబ్బులతో రెంట్లు కట్టుకోవాల్సి వస్తోందని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నా8/26/2022 7:19:57 PMరు. ఫండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేనప్పుడు పథకాన్ని ఎందుకు ప్రవేశపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

రేపు మాపు అంటున్నరు 

దళిత బంధు ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కింద ట్రాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం అప్లై చేసుకున్న. మొదట రూ.1.50 లక్షలను మా అకౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వేశారు. ఇప్పటి వరకు ట్రాక్టర్ ఇవ్వలేదు. ఆఫీసర్లను అడిగితే రేపు మాపు అంటు తిప్పుతున్నరు.

– తడకమళ్ల ఉప్పలయ్య, మామిడాల, తిరుమలగిరి మండలం

జేబులోంచి రెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కడుతున్న 

దళిత బంధు కింద మెడికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం అప్లై చేసుకున్న. రెంటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అగ్రిమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కావాలని ఆఫీసర్లు చెప్పడంతో ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అగ్రిమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకున్నాం. మొదటగా రూ.1.50 లక్షలు అకౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వేశారు. మిగతా డబ్బుల గురించి అడిగితే ఫండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాలేదు, వచ్చాక ఇస్తామంటున్నరు. ఖాళీ షాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్రతి నెలా రెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కడుతున్నాం.  

– తడకమళ్ల వెంకటయ్య, మామిడాల