‘పోల్ పాయింట్’ యాప్

‘పోల్ పాయింట్’ యాప్

పాడైపోయిన రోడ్లు, తెగిపోయిన ఎలక్ట్రిక్ వైర్.. ఇలా సిటీలో రోజుకో ప్రాబ్లమ్ వస్తుంటుంది. వాటిని  అధికారుల దాకా తీసుకెళ్లి, కంప్లైంట్ ఇచ్చేంత తీరిక అందరికీ ఉండకపోవచ్చు. ఒకవేళ కంప్లైంట్ ఇచ్చినా ఆ సమస్య ఎప్పటికి తీరుతుందో తెలియదు. అందుకే ఇలాంటి సమస్యలకు  సొల్యూషన్‌‌గా  ‘పోల్ పాయింట్’ అనే యాప్ క్రియేట్ చేశాడు ముంబైకి చెందిన 17 ఏండ్ల ముదిత్. 
ముంబైకి చెందిన ముదిత్‌‌కు కంప్యూటర్ సైన్స్, ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్స్ అంటే ఇష్టం. స్కూల్‌‌లో ఖాళీ టైం దొరికినప్పుడు యాప్స్ డెవలప్ చేస్తుంటాడు. అలా పుట్టిందే ‘పోల్ పాయింట్’ కూడా. ఈ యాప్ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య బ్రిడ్జిలా పనిచేస్తుంది. పోల్ పాయింట్ అనేది ఒక కమ్యూనికేషన్ ప్లాట్‌‌ఫామ్.  సిటీలో ఎక్కడ  సమస్య వచ్చినా దాన్ని యాప్ ద్వారా అందరికీ చెప్పొచ్చు. మిగతావాళ్లు కూడా దానికి రియాక్ట్​ కావచ్చు. ఈ యాప్‌‌లో షేర్ అయిన ప్రాబ్లమ్స్ అన్నీ ప్రభుత్వానికి చేరతాయి. అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనేది యాప్‌‌లో అప్‌‌డేట్ చేస్తారు. అలా ఈ యాప్ ద్వారా చుట్టుపక్కల ఉండేవాళ్లతో పాటు ప్రభుత్వంతో కూడా కనెక్ట్ కావచ్చు.  ఇందులో ఉండే ‘ఇంటిగ్రేటెడ్ యాక్టివ్ పోలింగ్’ ఫీచర్ ద్వారా చుట్టూ ఉన్న ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవచ్చు. ఈ యాప్‌‌లో సుమారు లక్షమంది ఒకేసారి పోల్ చేసే వీలుంది.

బీఎంసీ కూడా..

ముంబైవాసులతో మరింతగా కనెక్ట్ అయ్యేందుకు మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఈ యాప్‌‌తో కలిసి పనిచేస్తోంది. ఈ యాప్‌‌లో  జనరల్, లోకల్, ఇంటర్నేషనల్ ఇష్యూస్‌‌తో పాటు అడ్మినిస్ట్రేటివ్ సమస్యలు, లెజిస్లేటివ్ సమస్యలు, జ్యుడీషియల్ ఇష్యూస్.. ఇలా ఎన్నో కేటగిరీలు ఉంటాయి.  ఏయే సమస్యలకు ఎక్కువ పోల్స్ వస్తున్నాయి? ఎలాంటి సొల్యూ షన్‌‌ను కోరుకుంటున్నారో కూడా అధికారులకు తెలిసిపోతుంది. అలా ఈ యాప్ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య  ఉన్న గ్యాప్‌‌ను తగ్గిస్తోంది.

డిజిటల్ డెమోక్రసీ

“నాకున్న నాలెడ్జితో అందరికీ పనికొచ్చేలా ఒక యాప్ తయారు చేయాలనుకున్నా. అప్పుడే స్విట్జర్లాండ్‌‌లోని గవర్నమెంట్ పాలసీల గురించి తెలిసింది. అక్కడి ప్రభుత్వాలు యాప్ సాయంతో ప్రజల సమస్యలు తెలుసుకుని, సాల్వ్ చేస్తుంటాయి. ఈ మోడల్‌‌ ను మనదేశంలో తీసుకొస్తే బాగుంటుంది అనుకున్నా. అలా పోల్ పాయింట్ ఐడియా వచ్చింది. ఈ ఐడియాకు ‘డిజిటల్ డెమోక్రసీ’ అనే పేరు పెట్టా. ఎందుకంటే ఇది ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వానికి, ప్రభుత్వ ఆలోచనలను ప్రజలకు చేరవేస్తుంది కనుక. ఈ యాప్ యాపిల్ స్టోర్‌‌‌‌లో అందుబాటులో ఉంది. త్వరలోనే ఆండ్రాయిడ్ వెర్షన్ తెస్తాం. అలాగే ఈ యాప్‌‌ను మరింత డెవలప్ చేసి, దేశంలోని మిగతా సిటీల్లో కూడా తేవాలనుకుంటున్నా’’ అన్నాడు ముదిత్​.