
నటుడిగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్న సుహాస్ (Suhas)..లీడ్ రోల్‌లో వరుస సినిమాలు చేస్తున్నాడు. సలార్ మూవీకి డైలాగ్ రైటర్గా పనిచేసిన సందీప్ రెడ్డి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. సుహాస్ కి జోడిగా సంకీర్తన విపిన్ నటిస్తోంది. దిల్‌రాజు ప్రొడక్షన్ బ్యానర్‌లో ప్రొడక్షన్ నెం.4గా గతేడాది డిసెంబర్ లో షూటింగ్ స్టార్ట్ చేయగా..ప్రస్తుతం రిలీజ్ కు రెడీ అయ్యింది.
లేటెస్ట్గా ఈ సినిమా రిలీజ్ డేట్ని అనౌన్స్ చేశారు మేకర్స్.`ఇందుమూలంగా యావన్మంది ప్రజానీకానికి తెలియజేయునది ఏమనగా..సమ్మర్ కి చల్లటి నవ్వుల్ని పంచడానికి వచేస్తున్నమోహో..మీ క్యాలెండర్‌లో మే 24ని గుర్తు పెట్టుకోండి. దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్స్ లో నాలుగో చిత్రంలో నేను నటిస్తున్నాను. మేం అద్భుతమైన కామెడీతో వేడి పుట్టించటానికి సిద్ధంగా ఉన్నాం` అని సుహాస్ పోస్ట్ చేశారు.
రిలీజ్కి సంబంధించిన పోస్టర్ ఆసక్తిగా ఉంది. పోస్టర్లో చిన్న పాప మహిళా న్యాయమూర్తిగా కనిపిస్తోంది.చిన్నారి కళ్లకు గంతలు కట్టుకుని క్యూట్ స్మైల్ ఇస్తూ ఆకట్టుకుంటుంది. దీన్ని బట్టి ఈ సినిమా ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న ఒక ఫన్నీ కోర్టు డ్రామా అని అర్థమవుతుంది. #JAGonMay24 అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. త్వరలోనే ఈ సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు.
ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, గోపరాజు మరణ, మురళీ శర్మ, రఘుబాబు, పృథ్వీ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి బేబీ ఫేమ్ విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నాడు.
ఇందుమూలంగా యావన్మంది ప్రజానీకానికి తెలియజేయునది ఏమనగా?#DRP4 ?ing #Suhas
— Dil Raju Productions (@DilRajuProdctns) March 19, 2024
సమ్మర్ కి చల్లటి నవ్వుల్ని పంచడానికి వచేస్తున్నమోహో…❤️❤️
Worldwide Grand Release on May 24th.?#JAGonMay24 - Title Announcement Soon! @ActorSuhas @sangeerthanaluv#SandeepReddyBandla @VijaiBulganin… pic.twitter.com/lR7DEvqwiz