ఆస్పత్రిలో చేరిన బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్

V6 Velugu Posted on Jun 06, 2021

బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్ ఆస్పత్రిలో చేరారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో ఆయన ఆదివారం ఉదయం ముంబైలోని హిందూజా ఆసుపత్రిలో చేరారు. డాక్టర్ నితిన్ గోఖలే నేతృత్వంలోని వైద్యుల బృందం ఆయనను పర్యవేక్షిస్తోంది. దిలీప్ కుమార్ గత నెలలో రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసం అదే ఆస్పత్రికి వెళ్లి వైద్యుల సూచన మేరకు అడ్మిట్ అయ్యాడు. చికిత్స అనంతరం రెండు రోజుల తర్వాత డిశ్చార్జ్ అయ్యాడు. దిలీప్ కుమార్ ప్రస్తుతం ఆసుపత్రిలో సీనియర్ వైద్యులు, కార్డియాలజిస్ట్ డాక్టర్ నితిన్ గోఖలే మరియు పల్మోనాలజిస్ట్ డాక్టర్ జలీల్ పార్కర్ల సంరక్షణలో ఉన్నారు. 

కాగా.. దిలీప్ కుమార్ త్వరగా కోలుకోవాలని అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడ్తున్నారు. 

Tagged Bollywood, Mumbai, Dilip Kumar, breathlessness, actor dilip kumar, Hinduja hospital

Latest Videos

Subscribe Now

More News