ఢిల్లీలో మెరుగుపడిన ఎయిర్ క్వాలిటీ

ఢిల్లీలో మెరుగుపడిన ఎయిర్ క్వాలిటీ

న్యూఢిల్లీ : పొల్యూషన్ తగ్గడంతో ఆదివారం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ కొద్దిగా మెరుగుపడింది. సివియర్ నుంచి వెరీ పూర్ కేటగిరీకి చేరుకుందని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) ద్వారా వెల్లడైంది. శనివారం సాయంత్రం 4 గంటలకు సగటు ఏక్యూఐ 319గా నమోదు కాగా.. ఆదివారం ఉదయానికి కాస్త మెరుగుపడి ఏక్యూఐ 290కు చేరుకుంది. కానీ సాయంత్రం 4 గంటలకు ఎయిర్ క్వాలిటీ కొంచెం తగ్గిపోయి 301గా రికార్డ్ అయింది.

గాలి నాణ్యత మెరుగుపడటంతో కేంద్రం ఆదివారం కొన్ని ఆంక్షలను సడలించింది. ఢిల్లీ నగరానికి ట్రక్కుల ఎంట్రీ, ప్రాజెక్టులకు సంబంధించిన నిర్మాణ పనులపై ఉన్న నిషేధాన్ని ఎత్తేసింది. అయితే, దేశ రాజధానిలో రాబోయే రోజుల్లో ఎయిర్ క్వాలిటీ మెరుగుపడటం సాధ్యం కాకపోవచ్చని భారత వాతావరణ శాఖ చెప్పింది.