
న్యూఢిల్లీ: ఐపీఎల్ సెకండ్ ఫేజ్‌కు మార్గం సుగమమైన వేళ.. కోల్‌కతా నైట్‌రైడర్స్ కొత్త సమస్యను ఎదుర్కొంటున్నది. ఇంగ్లండ్ ప్లేయర్లు లీగ్‌కు అందుబాటులో ఉండబోరని ఈసీబీ ప్రకటించిన నేపథ్యంలో.. కేకేఆర్ కెప్టెన్సీ డైలమా మొదలైంది. మోర్గాన్ ప్లేస్‌లో ఎవరికి పగ్గాలు ఇవ్వాలన్న దానిపై చర్చలు జరుపుతోంది. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు మాజీ కెప్టెన్ దినేశ్ కార్తీక్కే మరోసారి బాధ్యతలు అప్పగించే చాన్స్ ఉందని తెలుస్తోంది. అయితే ఫ్రాంచైజీ నుంచి అఫీషియల్ ప్రకటన ఇంకా వెలువడలేదు. కొత్త కెప్టెన్‌ను నియమిస్తే టీమ్‌పై పట్టు సాధించే వరకు టైమ్ పడుతుందని ఫ్రాంచైజీ వర్గాలు భావిస్తున్నాయి. 2018లో గంభీర్ తర్వాత కెప్టెన్సీ తీసుకున్న కార్తీక్.. మూడేళ్ల పాటు టీమ్‌ను నడిపించినా సక్సెస్ కాలేదు. దాంతో, లాస్ట్ సీజన్ మధ్యలోనే అతడిని తప్పించి మోర్గాన్‌కు కెప్టెన్సీ అప్పగించింది. ఇప్పుడు మళ్లీ కార్తీక్కే పగ్గాలు ఇవ్వాలనుకుంటోంది.