కోహ్లీ వారసుడు రాహుల్ త్రిపాఠే...ఎందుకంటే..!

కోహ్లీ వారసుడు రాహుల్ త్రిపాఠే...ఎందుకంటే..!

భారత జట్టు ఆటగాడు రాహుల్ త్రిపాఠిపై దినేష్ కార్తీక్ ప్రశంసల వర్షం కురిపించాడు. రాహుల్ త్రిపాఠి ఫ్యూచర్లో కోహ్లీ వారసుడు అవుతాడని చెప్పుకొచ్చాడు. న్యూజిలాండ్ తో జరిగిన మూడో టీ20లో భారీ స్కోరు చేయడానికి రాహులే పునాది వేశాడని కొనియాడాడు. 

త్రిపాఠిని మరవొద్దు..

మూడో టీ20లో అద్బుతంగా ఆడిన రాహుల్ త్రిపాఠిని ఫ్యాన్స్ మరిచిపోవద్దని దినేష్ కార్తీక్ కోరాడు. రాబోయే రోజుల్లో రాహుల్ త్రిపాఠి పెద్ద ఆటగాడు అవుతాడని చెప్పాడు. మూడో టీ20లో అతను కేవలం 44 పరుగులకే చేశాడు కదా అని అనుకోవద్దన్నాడు. రాహుల్ త్రిపాఠి ఇప్పుడుప్పుడే పట్టాలెక్కుతున్నాడని..టీమ్ కోసం రిస్క్ చేసి ఆడుతున్నారని మెచ్చుకున్నాడు. 

కోహ్లీ వారసుడు అతడే..

టీమిండియాలో కోహ్లీకి రాహుల్ త్రిపాఠే సరైన వారసుడని దినేష్ కార్తీక్ చెప్పుకొచ్చాడు.  అతను మూడో టీ20లో ఆడిన ఇన్నింగ్స్ మరో 3 నెలలు, 6 నెలలైనా మర్చిపోవద్దని ఫ్యాన్స్ ను కోరాడు. రాబోయే ఐపీఎల్ లో అతను రాణించినా రాణించకపోయిన..భారత జట్టులో మూడో స్థానానికి రాహలే సరైనోడు అని వెల్లడించాడు.  మూడో స్థానంలో కోహ్లీ ఆడితే ఓకే అని..ఒక వేళ కోహ్లీ ఆడకపోతే మాత్రం రాహుల్ త్రిపాఠిని మూడో ప్లేస్ లో ఆడించాలని జట్టు మేనేజ్ మెంట్ కు సూచించాడు. 

అద్బుత ఆటతీరు..

ఇక అహ్మదాబాద్ లో న్యూజిలాండ్‌తో మూడో టీ20లో రాహుల్ త్రిపాఠి 22 బంతుల్లో 44 పరుగులు సాధించాడు. ఇందులో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు న్నాయి.  రాహల్ తన సూపర్ ఇన్నింగ్స్ తో  భారత జట్టు భారీ స్కోరు చేయడానికి పునాది వేశాడు. అతని సపోర్ట్‌తో క్రీజులో సెట్ అయిన  శుభ్ మన్ గిల్ భారీ సెంచరీ చేశాడు.