ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ న్యూమరస్ మోటార్స్, తన మల్టీ యుటిలిటీ ఈ–-స్కూటర్ 'డిప్లోస్ మాక్స్' సరికొత్త వెర్షన్ 'డిప్లోస్ మాక్స్ ప్లస్'ను విడుదల చేసింది. ఈ కొత్త వెర్షన్ ఐదు అప్‌గ్రేడ్‌లతో, డ్యూయల్ కలర్‌తో అందుబాటులో ఉంది. ఇందులో 4.0 వాట్అవర్ బ్యాటరీ, 70 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. గరిష్టంగా 156 కిలోమీటర్ల స్పీడుతో వెళ్తుంది. హైదరాబాద్‌లో దీని ధర రూ.1,15,103. ప్రస్తుతం 14 నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీ 2026-–27 ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు 50 నగరాల్లో 100 డీలర్లను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
రూ.5,410.04 కోట్లకు ఏయూఎం
తన ఫ్లాగ్‌షిప్ ఈక్విటీ ఫండ్ బజాజ్ ఫిన్‌సర్వ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఆస్తుల నిర్వహణ (ఏయూఎం) విలువ కేవలం రెండేళ్లలో రూ.5,410.04 కోట్లకు చేరిందని బజాజ్ ఫిన్‌సర్వ్ ఏఎంసీ ప్రకటించింది. ఈ ఫండ్ రెగ్యులర్ ప్లాన్ కింద 19.19 శాతం, డైరెక్ట్ ప్లాన్ కింద 20.91 శాతం సీఏజీఆర్ రాబడిని అందించింది. ఈ ఫండ్ ప్రస్తుతం 81 స్టాక్‌లలో పెట్టుబడులు పెడుతుంది. ఈ ఫండ్ 2023 ఆగస్టులో ప్రారంభమై, 2,52,388 ఫోలియోలను ఆకర్షించింది. బీఎస్ఈ 500 టీఆర్ఐను దీనికి బెంచ్‌మార్క్‌గా నిర్ణయించారు.
భారీ వృద్ధిని సాధించిన హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్
హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఈ ఏడాది మొదటి క్వార్టర్లో బలమైన వృద్ధిని సాధించినట్టు ప్రకటించింది. పర్సనల్ యాన్యువలైజ్డ్ ప్రీమియం ఈక్వివలెంట్ (ఏపీఈ) సంవత్సరానికి 12.5 శాతం పెరిగింది. కంపెనీ తన మార్కెట్ వాటా 70 బేసిస్ పాయింట్లు పెరిగి 12.1 శాతానికి చేరింది. ప్రైవేట్ రంగంలో 40 బేసిస్ పాయింట్ల పెరుగుదలతో 17.5 శాతానికి చేరుకుంది. ఎంబెడెడ్ వాల్యూ రూ.58,355 కోట్లకు ఎగిసింది. పన్ను తర్వాత లాభం 14 శాతం వృద్ధితో రూ.546 కోట్లుగా ఉంది. రెన్యువల్కలెక్షన్లు 19 శాతం పెరిగాయి. కొత్త వ్యాపారం (వీఎన్‌బీ) విలువ రూ.809 కోట్లుగా ఉంది.
