మెగాస్టార్తో అనిల్ రావిపూడి సినిమా !

మెగాస్టార్తో అనిల్ రావిపూడి సినిమా !

టాలీవుడ్లో  రైటర్, డైరెక్టర్ జంధ్యాల(Jandhyala), ఈవీవీ సత్యనారాయణ(E. V. V. Satyanarayana) వంటి డైరెక్టర్స్ ..హ్యూమర్ ను అందిపుచ్చుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anilravipudi). ప్రత్యేకించి హాస్యకథా చిత్రాలు తీయటంలో అందె వేసిన చెయ్యి వీరిది. ఇప్పుడు అనిల్ రావిపూడి కూడా తనదైన కామిక్ యాంగిల్ లో క‌మ‌ర్శియ‌ల్ పంథాలో సినిమాలు చేస్తూ వ‌రుస‌గా సూపర్ హిట్ మూవీస్ తెరకెక్కిస్తున్నాడు.

అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఫస్ట్ మూవీ పటాస్ నుంచి సరిలేరు నీకెవ్వరూ వరకు తన సక్సెస్ ను కొనసాగిస్తున్నాడు. ఇక ఇప్పుడు మాస్ హీరో బాలయ్య బాబు తో భగవంత్ కేసరి (Bhagavanthkesari) అంటూ..మాస్ యాంగిల్ మూవీతో వస్తున్నాడు.

అనిల్ రావిపూడి కెరీర్ స్టార్టింగ్లో యంగ్ హీరోస్ తో సినిమాలు చేస్తూనే..సీనియర్ హీరో వెంకటేష్, మహేష్ బాబు, బాలకృష్ణ వంటి స్టార్స్ తో సినిమాలు చేస్తూ వావ్ అనిపించుకున్నాడు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం..మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తో సినిమా చేయడానికి కథను రెడీ చేసుకున్నాడని సమాచారం.

బాలయ్య బాబు భ‌గ‌వంత్ కేస‌రి రిలీజ్ అయిన వెంట‌నే..చిరు స్టోరీ సిట్టింగ్లో నిమగ్నం అవుతాడని సినీ వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది. చిరంజీవి సినిమా కెరీర్ కూడా..సో సో గానే ఉండటంతో..అనిల్ రావిపూడి వంటి స్టార్ డైరెక్టర్తో సినిమా చేయడం మంచిదే అంటున్నారు మెగా ఫ్యాన్స్.

ఇప్పటికే చిరంజీవితో కథ చర్చలు కూడా పూర్తయినట్లు సమాచారం. అనిల్ రావిపూడితో ప్రొడ్యూసర్ దిల్ రాజు(Dil Raju)  ఓ సినిమాకు క‌మిట్ మెంట్ సెట్ అయింది. అది చిరంజీవి సినిమా అవ‌డానికి ఛాన్సెస్ క‌నిపిస్తున్నాయి. అన్ని కుదిరితే..త్వరలో వీరిద్దరి కాంబో నుంచి అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. 


ALSO READ : అశ్రునయనాల మధ్య ముగిసిన ప్రవల్లిక అంత్యక్రియలు