గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబో వస్తున్న మరో ప్రతిష్టాత్మక చిత్రం 'అఖండ 2: తాండవం'. వీరిద్దరి కలయికతో సినిమా అంటేనే అంచనాలు భారీగా ఉంటాయి. పాన్ ఇండియా స్థాయిలో సిద్ధమైన ఈ మూవీ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా.. ‘అఖండ 2 : తాండవం’ చిత్రంలో హీరో బాలకృష్ణ ఉపయోగించిన వాహనాన్ని (Akhanda Roxx Car) గురువారం (Nov 27) హైదరాబాద్‌లో లాంచ్ చేశారు.
Akhanda Roxx Car ప్రత్యేకతలు:
ఎక్స్ డ్రైవ్ అత్యాధునిక ఇంజినీరింగ్‌తో నిర్మించగా, ఎక్స్ స్టూడియోస్ దానికి అద్భుతమైన సినిమాటిక్ లుక్‌ను అందించింది. అఖండ 2 కోసం దాదాపు పది ప్రత్యేక వెహికల్స్ డిజైన్ చేయించామని, వాటికి వెనుక ఉన్న కృషి అమర్‌దేనని చెప్పారు. పవర్, వారసత్వం, మాస్ ఎనర్జీకి నిదర్శనంగా నిలిచేలా ఈ వాహనం రూపుదిద్దుకుంది.
బాలకృష్ణ శక్తివంతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌కు ప్రతిబింబంగా, కథనానికి అనుసంధానమైన డిజైన్‌తో ఈ వెహికల్‌ను రూపొందించారు. యాక్షన్ సీక్వెన్సెస్‌లో ఈ వెహికల్ ఎలా మెస్మరైజ్ చేస్తుందో థియేటర్‌లో చూసినప్పుడు ప్రేక్షకులు గర్వంగా ఫీలవుతారు. ఈ క్రమంలో Roxx Carని అద్భుతంగా డిజైన్ చేసిన అమర్‌ను దర్శకుడు బోయపాటి శ్రీను అభినందించారు.
Blockbuster director Boyapati Sreenu unveils the iconic Akhanda Roxx car used by ‘GOD OF MASSES’ Balakrishna in #Akhanda2Thaandavam ❤️🔥💥#Akhanda2 in cinemas worldwide on December 5th. pic.twitter.com/tL17fK7SsD
— 14 Reels Plus (@14ReelsPlus) November 28, 2025
'అఖండ 2' ప్రీ-రిలీజ్ ఈవెంట్..
'అఖండ 2' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను ఇవాళ (నవంబర్ 28) శుక్రవారం నాడు హైదరాబాద్‌లోని కైతలాపూర్ గ్రౌండ్స్‌లో సాయంత్రం 4 గంటల నుంచి నిర్వహించనున్నారు. వేలాది మంది అభిమానుల మధ్య ఈ వేడుక అత్యంత వైభవంగా, కన్నులపండువగా జరగనుంది. అందుకు సంబందించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈవెంట్ సమయంలో కూకట్‌పల్లి కైతలాపూర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్స్ అమల్లో ఉంటాయని పోలీసు శాఖ వెల్లడించింది.
ఇకపోతే, ఈ 'అఖండ 2' సనాతన ధర్మం నేపథ్యంతో తెరకెక్కడం వల్ల, ఆధ్యాత్మిక వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ పలువురు ప్రముఖ ఆధ్యాత్మిక గురువులను కూడా ఈ వేడుకకు ఆహ్వానించే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది.
