తమన్ లేకపోయినా అఖండ అలాగే ఉండేది.. బోయపాటి షాకింగ్ కామెంట్స్

తమన్ లేకపోయినా అఖండ అలాగే ఉండేది.. బోయపాటి షాకింగ్  కామెంట్స్

నటసింహ బాలకృష్ణ(Balakrishna) హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ అఖండ(Akhanda). మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను(Boyapati srinu) తెరకెక్కించిన ఈ సినిమా మాస్ ఆడియన్స్ ను ఫుల్లుగా ఎంటర్టైన్ చేసింది. దీంతో బాలకృష్ణ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది అఖండ మూవీ. ఇక ఈ సినిమా అంతా ఒకెత్తు అయితే.. అఘోరా పాత్రలో బాలకృష్ణ నటన సినిమాకే హైలెట్ గా నిలిచింది.

ఇక ఈ సినిమాకు తమన్ అందించిన సంగీతం అయితే నెక్స్ట్ లెవల్ అని చెప్పొచ్చు. తన ఎలక్ట్రిఫయింగ్ మ్యూజిక్ తో సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లారు. ఒక్కో ఎలివేషన్ ను ఆయన ఇచ్చిన మ్యూజిక్ ఆడియన్స్ ను గూస్బంప్స్ తెప్పించింది. తన మ్యాజికల్ మ్యూజిక్ తో థియేటర్స్ లో మాస్ జాతర చేశాడు తమన్. అందుకే.. అంతకు ముందు ఏ సినిమాకు కూడా రాని ప్రశంసలు ఈ సినిమాకు అందుకున్నాడు తమన్. ఆడియన్స్ కూడా ఈ సినిమా విషయంలో తమన్ ను ఆకాశానికెత్తేశారు. కథలో దమ్ము లేకపోయినా.. కేవలం తన మ్యూజిక్ తో సినిమాను నడిపించాడు తమన్ అంటూ ఓపెన్ గానే కామెంట్స్ చేశారు. 

అయితే.. తాజాగా అఖండ విషయంలో తమన్ చేసింది ఏమీ లేదంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు ఆ చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను. ఈయన దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ స్కంద. రామ్ పోతినేని హీరోగా వచ్చిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంతో ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు బోయపాటి శ్రీను. ఇందులో భాగంగా అఖండ సినిమా విషయం రాగా.. దానికి సమాధానంగా బోయపాటి మాట్లాడుతూ.. అఖండ సినిమా కథే అలాంటిది. ఆ సినిమాకు తమన్ మ్యూజిక్ యాడ్ అయ్యింది అంతే కానీ.. దాని కోసం అతను ప్రత్యేకంగా చేసింది ఏమీలేదు. అఖండ సినిమాను మ్యూజిక్ లేకుండా చూసినా మీకు అదే ఫీలింగ్ వస్తుంది. అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో చాలామంది నెటిజన్స్ బోయపాటిపై రెచ్చిపోతున్నారు. తమన్ మ్యూజిక్ లేకేపోతే అఖండ ఎవరు చూసేవారు కాదని, ఆ సినిమా సక్సెస్ లో మేజర్ పార్ట్ అంటే తమన్ అని, ఎవరి క్రెడిట్స్ వారికివ్వాలని కామెంట్స్ చేస్తున్నారు.