Buchi Babu Sana: ఉప్పెన సినిమా దర్శకుడు బుచ్చిబాబు ఇంట తీవ్ర విషాదం

Buchi Babu Sana: ఉప్పెన సినిమా దర్శకుడు బుచ్చిబాబు ఇంట తీవ్ర విషాదం

ఉప్పెన సినిమా దర్శకుడు బుచ్చిబాబు సన(Buchi Babu Sana) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తండ్రి పెదకాపు శుక్రవారం ఉదయం కన్నుమూశారు. దీంతో.. బుచ్చిబాబు ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక బుచ్చిబాబు తండ్రి మరణం పట్ల ఇండస్ట్రీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. 

ఇక బుచ్చిబాబు విషయానికి వస్తే.. ఆయన స్టార్ డైరెక్టర్ సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేశారు. ఆతరువాత ఉప్పెన సినిమాతో దర్శకుడిగా మారారు. మొదటి సినిమానే భారీ విజయాన్ని సాధించింది. ఇక ప్రస్తుతం బుచ్చిబాబు తన రెండవ సినిమాను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో చేస్తున్నాడు. ఇటీవలే లాంఛనంగా మొదలైన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది. ఆస్కార్ విజేత ఏఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీ రోల్ చేస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.