
ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మరణ వార్తకు సంబంధించి జాతీయ మీడియా సరైన ప్రాధాన్యం ఇవ్వలేదంటూ డైరెక్టర్ హరీష్ శంకర్ మండిపడ్డారు. తన ట్విట్టర్ వేదికగా ప్రముఖ ఇంటర్నేషనల్ ఛానల్ బీబీసీ.. ఎస్పీ బాలు మరణంపై ప్రచురించిన ఓ వీడియోని పోస్ట్ చేస్తూ… ఇంటర్నేషనల్ మీడియా కూడా ఎంత అద్భుతంగా ప్రెజెంట్ చేసిందో.. మన నేషనల్ మీడియా ని చూస్తే జాలేస్తుంది..అంతేలే.. కొందరి స్థాయి విశ్వవ్యాప్తం.. ఇరుకు సందుల్లో కాదు” అంటూ హరీష్ శంకర్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ కి పలువురు నెటిజన్లు మద్దతు పలుకుతున్నారు.
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు శనివారం అశ్రు నివాళులతో ముగిశాయి. తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో చెన్నై సమీపంలోని తామరైపాక్కం ఫాంహౌస్‌లో అయన అంతిమ సంస్కారాలు జరిగాయి.
ఇంటర్నేషనల్ మీడియా కూడా ఎంత అద్భుతంగా ప్రెజెంట్ చేసిందో..
మన నేషనల్ మీడియా ని చూస్తే జాలేస్తుంది..అంతేలే..
కొందరి స్థాయి విశ్వవ్యాప్తం..
ఇరుకు సందుల్లో కాదు.. pic.twitter.com/hcYDqMU9WK
— Harish Shankar .S (@harish2you) September 26, 2020