నా ఆకలి తీర్చావు అన్నయ్య..నీ కోసం ఏమి చేసినా తక్కువే: హరీష్ శంకర్

నా ఆకలి తీర్చావు అన్నయ్య..నీ కోసం ఏమి చేసినా తక్కువే: హరీష్ శంకర్

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar), మాస్ మహారాజా రవితేజ (Ravi Teja)ని ఏ స్థాయిలో ప్రేమిస్తాడో..పూజిస్తాడో చాలా సందర్భాల్లో వింటూ వస్తున్నాం. తన సినిమా ప్రస్థానానికి రవితేజ మూలవిరాట్ అని..తాను లేకపోతే ఈ జీవితం లేదని..డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రతిసారి చెబుతూ వస్తూనే ఉన్నారు.

లేటెస్ట్గా హరీష్ శంకర్ మరోసారి రవితేజపై ఉన్న ప్రేమను చెప్పుకొచ్చాడు. ఇవాళ (జనవరి 26 ) రవితేజ బర్త్డే స్పెషల్ గా హరీష్ చేసిన ట్వీట్..మాస్ రాజా ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. అన్నయ్య..'నా ఆకలి తీర్చావు..నా ఆనందాన్ని పంచుకున్నావు..నా ఆవేశాన్ని అర్థం చేసుకున్నావు..నా ఆశలకి ఆయువు పోశావు' ఇలా నేను ఎంత చెప్పినా..ఏమి చేసినా తక్కువే..నాకు ఎన్నో జన్మలకు సరిపడేలా ఊపిరి పోసిన..నీకు..జన్మదిన శుభాకాంక్షలు అన్నయ్య' లవ్ యూ ఫరెవర్ అంటూ హరీష్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

ప్రస్తుతం వీరిద్దరి కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్(Mister Bachhan). పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇటీవలే గపూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. హిందీలో అజయ్ దేవగన్ నటించిన సూపర్ హిట్ సినిమా రైడ్. రవితేజ బర్త్ డే స్పెషల్ గా రిలీజ్ చేసిన బచ్చన్ పోస్టర్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది.