పంజాగుట్ట స్మశానవాటికలో కె.విశ్వనాథ్ అంత్యక్రియలు

పంజాగుట్ట స్మశానవాటికలో కె.విశ్వనాథ్ అంత్యక్రియలు

లెజెండ్రీ డైరెక్టర్ కె.విశ్వనాథ్ (93)​ఇవాళ కన్నుమూశారు. కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి హైదరాబాద్​లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 11:30 గంటలకు పంజాగుట్ట స్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.  కె.విశ్వనాథ్ మృతితో టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. పలువురు సినీ నటులు, రాజకీయ నాయకలు సంతాపం తెలియజేస్తున్నారు. 

1966లో ఆత్మగౌరవం సినిమాతో దర్శకుడిగా పరిచయమైన విశ్వనాథ్​.. సిరిసిరిమువ్వ, సాగర సంగమం, శంకరాభరణం, స్వాతికిరణం, సప్తపది, ఆపద్బాంధవుడు వంటి ఎన్నో ఆణిముత్యాలను అందించారు. ఆయన ప్రతి సినిమాలో సంస్కృతి సంప్రదాయాలకు, కళలకు పెద్దపీట వేశారు. ఎన్నో చిత్రాల్లో నటించారు.