Mad Sequel: మ్యాడ్ సీక్వల్ టైటిల్ రివీల్..షూటింగ్ ఎప్పుడో చెప్పిన డైరెక్టర్!

Mad Sequel: మ్యాడ్ సీక్వల్ టైటిల్ రివీల్..షూటింగ్ ఎప్పుడో చెప్పిన డైరెక్టర్!

అసలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సూపర్ హిట్ గా నిలిచిన సినిమా మ్యాడ్ (Mad). అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్(Narne Nithin) హీరోగా ఎంట్రీ ఇవ్వగా సంగీత్ శోభన్(Sangeeth Shobhan), రామ్ నితిన్(Ram Nithin), శ్రీ గౌరీ ప్రియా(Srigouri priya), అనంతిక(Ananthika) ప్రధాన పాత్రల్లో నటించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది.

అంతేకాదు అదిరిపోయే కలెక్షన్స్ కూడా రాబట్టింది. కొత్త దర్శకుడు కళ్యాణ్ శంకర్ (Kalyan Shankar) తెరకెక్కించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ కు ఆడియన్స్ ఫిదా అయ్యారు. కాలేజ్ లైఫ్, అక్కడ ఉండే అల్లరి, హాస్టల్ డేస్ ను ఫన్నీ వేలో ప్రెజెంట్ చేసిన ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయడంతో ఫుల్ సక్సెస్ అయ్యాడు దర్శకుడు. దీంతో ఈ సినిమా నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది.

ఈ నేపథ్యంలో ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన టిల్లు స్క్వేర్ సక్సెస్ సెలబ్రేషన్స్లో..మ్యాడ్ డైరెక్టర్ కూడా పాల్గొన్నాడు. అంతేకాదు టిల్లు స్క్వేర్ మూవీకి కళ్యాణ్ శంకర్ కూడా రైటింగ్ డిపార్ట్మెంట్లో పనిచేశారు.దీంతో మీడియా ఆయనని మీ మ్యాడ్ సీక్వల్ ఎంతవరకు వచ్చింది అని అడిగితే ఈ విషయమై ఆయన స్పందించారు. 

మ్యాడ్ సీక్వెల్కి ఇప్పటికే టైటిల్ ఫిక్స్ చేసామని..మాడ్ మాక్స్ పేరుతో సీక్వెల్ తెరకెక్కుతుందని వెల్లడించాడు. ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల ఏప్రిల్ 12వ తేదీ నుంచి మొదలుపెట్టబోతున్నామని తెలిపాడు. దీంతో ఫ్యాన్స్ ఖుషీలో ఉన్నారు. అయితే ఆఫ్ ది రికార్డుగా అందుతున్న సమాచారం మేరకు..అయితే ఈసారి ఎంటర్టైన్మెంట్ డోస్ ను మరింత పెంచనున్నారట. అందుకోసం ఓ స్టార్ హీరోను ఈ సినిమాలోకి తీసుకోనున్నారట మేకర్స్.

ఈ సీక్వెల్ లో మాత్రం ఆ ముగ్గురు కుర్రాళ్ళు ఉద్యోగాలు వేటలో పడడంతో ఉంటుందని అంటున్నారు. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. మరి ఈ సారి భారీ అంచనాలతో వస్తున్న మ్యాడ్ సీక్వెల్ ఆడియన్స్ ను ఏ రేంజ్లో ఆకట్టుకుంటుందో చూడాలి.