GHAATI: మహిళ సాధికారికతపై క్రిష్ సినిమా..అనుష్క పాత్ర వేదంని మించి!

GHAATI: మహిళ సాధికారికతపై క్రిష్ సినిమా..అనుష్క పాత్ర వేదంని మించి!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా అనుష్క మంచి గుర్తింపు పొందారు. తనదైన నటనతో ఆకట్టుకునే అనుష్క..ప్రస్తుతం ఫీమేల్ ఓరియెంటెడ్ స్టోరీస్ ను సెలెక్ట్ చేసుకుంటూ వెళుతుంది. రీసెంట్గా స్వీటీ మిస్ శెట్టి..మిస్టర్ పోలిశెట్టి మూవీతో మంచి హిట్ అందుకుంది. ఇక తాజాగా అనుష్క కెరీర్ లోనే పూర్తి డిఫరెంట్ రోల్ ప్లే చేస్తుందని తెలుస్తుంది. 

ప్రస్తుతం అనుష్క యువీ క్రియేషన్స్లో ఓ సినిమా చేస్తోంది. ఈ సినిమాను క్రిష్(Krish) జాగర్లమూడి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు ఘాతీ (GAATI) అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఘాతీ అనగా లోయ అని అర్ధం.

తాజాగా ఈ సినిమాను అమెజాన్ ఈవెంట్లో మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. ఇందులో అనుష్క వేశ్యగా కనిపిస్తున్నట్లు సమాచారం. రిలీజ్ చేసిన పోస్టర్ లో అనుష్క ముఖాన్ని చూపించలేదు కానీ, చీరను ముఖాన కప్పుకొని ఎడారిలో ఒంటరిగా నడుస్తున్నట్లు చూపించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఘాతీ కథ విషయానికి వస్తే..ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో తనకు జరిగిన అన్యాయంపై పోరాటం చేసే ఓ సాధారణ అమ్మాయిగా అనుష్క కనిపించనుందట. ఇంకాస్త లోతుగా చెప్పాలంటే.. 'అనుకోని పరిస్థితుల కారణంగా ఒక రొచ్చులో ఇరుకున్న మహిళ.. తన సాధికారికతను చూపించుకోవడానికే ఎలా పోరాడింది..ఆ పోరాటంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంది' అనే కథతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు క్రిష్. 

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో వేసిన ప్రత్యేకమైన సెట్‌‌‌‌‌‌‌‌లో గత కొద్ది రోజులుగా షూటింగ్ జరుగుతోంది. అనుష్కపై కీలక సన్నివేశాలు తీస్తున్నట్టు సమాచారం. వేదం సినిమాకు సంగీతం అందించిన కీరవాణి, దీనికీ సంగీతం అందిస్తున్నారు. 

అనుష్క- క్రిష్ కాంబినేషన్ అంటే గుర్తొచ్చేది వేదం. ఈ సినిమాలో అనుష్క వేశ్య కనిపించి తెలుగు ఆడియన్స్ ని కట్టిపడేసిందనే చెప్పాలి. డైలాగ్స్, లుక్స్, మెస్మరైజింగ్ యాక్టింగ్ ఇలా ప్రతిఒక్కటి వేదంలో చక్కగా కుదిరాయి. ఇక మరోసారి రాబోతున్న ఈ కాంబినేషన్ ఇంకో రెండు దశాబ్దాలు గుర్తుండేలా ఘాతీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మరి ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

త్వరలో ఈ సినిమా నుంచి మరిన్ని అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు మలయాళంలో ‘కథనార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ అనే చిత్రంలో నటిస్తోంది అనుష్క.