ఇకనుండి ఆ పనిచేయను.. దానివల్లే లియో మూవీకి అలాంటి టాక్!

ఇకనుండి ఆ పనిచేయను.. దానివల్లే లియో మూవీకి అలాంటి టాక్!

లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj).. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఈ పేరు ఇప్పుడొక బ్రాండ్. తీసింది ఐదు సినిమాలే అయినా నెక్స్ట్ లెవల్ క్రేజ్ సంపాదించుకున్నాడు ఈ దర్శకుడు. అందుకే ఈయన నుండి ఒక సినిమా వస్తుందంటే.. అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇక ఇటీవలే తమిళ స్టార్ హీరో విజయ్ తో ఆయన తీసిన లియో మూవీ ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఏకంగా రూ.600 కోట్ల వసూళ్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. 

అయితే లియో భారీ విజయం సాధించినప్పటికీ అన్నివర్గాల ప్రేక్షకులను అలరించలేకపోయింది. కారణం లియో మూవీ సెకండ్ హాఫ్. అవును లియో మూవీ సెకండ్ హాఫ్ బాలేదని కామెంట్స్ చాలానే వినిపించాయి. ఆ విషయాన్ని లోకేష్ కూడా ఓపెన్ గానే ఒప్పేసుకున్నాడు. ఇక తాజాగా మరోసారి ఈ తరహా కామెంట్స్ చేశారు లోకేష్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన లియో రిజల్ట్ గురించి మాట్లాడుతూ.. లేవు సినిమా విషయంలో ముందే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం మైనస్ గా మారింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుందన్న కంగారులో తీయాలన్న సీన్స్ ను సరిగా తీయలేకపోయాము. ఆ కారణంగానే లియో సెకండ్ హాఫ్ పై అలాంటి కామెంట్స్ వినిపించాయి. ఇక నుండి నా సినిమాలకు రిలీజ్ డేట్ ముందు ప్రకటించను.. అంటూ చెప్పుకొచ్చాడు లోకేష్.

ఇక లోకేష్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ రజినీకాంత్ తో ఓ యాక్షన్ మూవీ చేయనున్నాడు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు కథా చర్చల్లో ఉంది. త్వరలోనే షూటింగ్ మొదలు కానున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. లోకనాయకుడు కమల్ హాసన్ కుక్ విక్రమ్ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన లోకేష్ రజినీకాంత్ కు ఎలాంటి మూవీ ఇస్తారో అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్.