రియల్ లైఫ్ కథతో.. మార్కెట్ మహాలక్ష్మి 

రియల్ లైఫ్ కథతో.. మార్కెట్ మహాలక్ష్మి 

‘కేరింత’ ఫేమ్  పార్వతీశం,  ప్రణీకాన్వికా జంటగా నటించిన చిత్రం ‘మార్కెట్ మహాలక్ష్మి’.  వి.యస్. ముఖేష్ దర్శకత్వంలో అఖిలేష్ కలారు నిర్మించారు. ఏప్రిల్ 19న సినిమా విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘యూట్యూబ్‌‌లో కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేశా. ఓ రోజు ప్రొడ్యూసర్ అఖిలేష్‌‌ను కలిసి ఈ స్ర్కిప్ట్ చెప్పా. ఆయనకు నచ్చడంతో ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాం.

ఇది లవ్ స్టోరీతో పాటు  ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌టైనర్. నిజ జీవితంలో నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ కూరగాయలు అమ్మే అమ్మాయిని ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడు. ఈ పాయింట్‌‌నే  కథగా రాశా. రియల్‌‌ లైఫ్‌‌కు దగ్గరగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం.  పార్వతీశం,  ప్రణీకాన్వికా  తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

పార్వతీశంకి ఇది కమ్ బ్యాక్ సినిమా అవుతుంది.  ఇందులోని  బ్యాక్‌‌గ్రౌండ్ స్కోర్,  పాటలు ఫ్రెష్ ఫీల్‌‌ని ఇస్తాయి. మా చిత్రానికి చాలా ఓటీటీ ఆఫర్స్ వచ్చాయి.  కానీ మా టీమ్ థియేట్రికల్ రిలీజ్‌‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకముంది’ అని చెప్పాడు.
s