Kalki Movie: IIT బాంబే Tech Fest 23లో..డైరెక్టర్ నాగ్ ఆశ్విన్ చెప్పిన ఆసక్తికర విషయాలు ఇవే..

Kalki Movie: IIT బాంబే Tech Fest 23లో..డైరెక్టర్ నాగ్ ఆశ్విన్ చెప్పిన ఆసక్తికర విషయాలు ఇవే..

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్(Prabhas) న‌టిస్తున్న లేటెస్ట్ సైన్స్ ఫిక్ష‌న్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ కల్కి 2898 AD(Kalki 2898AD). టాలీవుడ్ క్రియేటీవ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag ashwin) తెరకెక్కిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్పై అశ్విని దత్ భారీగా నిర్మిస్తున్నారు.
 
ఇవాళ (డిసెంబర్ 29న) డైరెక్టర్ నాగ్ అశ్విన్ IIT బాంబే Tech Fest 23 లో పాల్గొన్నారు. అక్కడ స్టూడెంట్స్ తో నాగ్ ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా స్టూడెంట్స్ కల్కి సినిమా గురించి అడిగిన పలు ప్రశ్నలకు ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ ఇచ్చారు. 

స్టూడెంట్ : కల్కి ట్రైలర్ రిలీజ్ ఎప్పుడు?

నాగ్ అశ్విన్ : మరో 93 రోజుల్లో.

స్టూడెంట్ : ఇప్పటివరకు వచ్చిన సైన్స్ ఫిక్షన్ సినిమాలకు, కల్కి ఎంత భిన్నంగా ఉండబోతుంది?

నాగ్ అశ్విన్ :  మీరు సరిగ్గా గమనిస్తే..మన దగ్గర సైన్స్ ఫిక్షన్ సినిమాలు మరి ఎక్కువ రాలేదనే చెప్పాలి. అందులో కొన్ని టైం ట్రావెల్ కు సంబందించిన మూవీస్ వచ్చాయి.ఇపుడు ప్రభాస్ కల్కి అందుకు చాలా డిఫరెంట్ సబ్జెక్టు తో వస్తుంది. కల్కి కథ ఒక సెపరేట్ వరల్డ్ ని క్రియేట్ చేస్తూ..అందులో జరిగే కథగా రాబోతుంది. 

అంతెందుకు..మనందరం హాలీవుడ్ సినిమాల్లో అక్కడి సిటీలు భవిష్యత్ లో ఎలా ఉంటాయో చూసి తెలుసుకున్నాం. అలా ‘కల్కి’లో ఇండియా ఫ్యూచర్ సిటీలు ఎలా ఉండబోతాయో స్పెషల్ గా చూపించబోతున్నాం. కల్కి మూవీ కోసం టీమ్ అంత దాదాపు ఐదేళ్ళుగా కష్టపడుతున్నాం.ఈ సినిమాలో వచ్చే ప్రతి అంశంపై లోతైన అవగాహనతో ఆలోచించి సినిమాను తెరకెక్కిస్తున్నాం.

Catch our Director @nagashwin7 LIVE in conversation at TECH FEST’23, IIT Bombay.

▶️ https://t.co/UKMWJmvSwE#Kalki2898AD #Prabhas @SrBachchan @ikamalhaasan @deepikapadukone @nagashwin7 @VyjayanthiFilms @Kalki2898AD@iitbombay @Techfest_IITB

— Kalki 2898 AD (@Kalki2898AD) December 29, 2023

 

 

స్టూడెంట్ : కల్కి‘2898 AD’ అనే టైమ్ లైన్ పెట్టడానికి కారణం ఏంటి?

నాగ్ అశ్విన్ : ఈ టైటిల్ వెనుక ఒక మంచి లాజిక్ వుంది. అయితే అది ఇపుడే చెప్పలేను. సినిమా రిలీజ్ కు ముందు చెప్తాను. 

స్టూడెంట్ : కల్కి మూవీ కోసం ప్రభాస్ ఎలా మేకోవర్ అయ్యారు ? 

నాగ్ అశ్విన్ : కల్కిలో ఫ్యూచర్ ప్రభాస్ ని చూస్తారు.

స్టూడెంట్ : కల్కి అంటే విష్ణు అవతారం అని పురాణాల్లో అంటారు కదా..మీరు కూడా నాగీ యూనివర్స్ ని ప్లాన్ చేస్తున్నారా?

నాగ్ అశ్విన్ : లేదు.

స్టూడెంట్ : కల్కి మ్యూజిక్ కోసం సంతోష్ నారాయణ్ ని తీసుకోవడానికి ముఖ్య కారణం?

నాగ్ అశ్విన్ : సంతోష్ నారాయణ్ మ్యూజిక్ లో తెలియని ఒక స్పార్క్ ఉంటుంది. ఇండియన్ రూట్ తో వరల్డ్ ఫీలింగ్ కలిగించే మ్యూజిక్ ఇచ్చే అతి కొద్దిమంది కంపోజర్స్ లో సంతోష్ నారాయణ్ ఒకరు. అందుకే ఆయన్ని ఎంచుకున్నాము. 

స్టూడెంట్ :  ప్రభాస్, కమల్ హసన్, అమితాబ్ వంటి వరల్డ్ స్టార్స్ తో వర్క్ చేయడం ఎలా అనిపించింది?

నాగ్ అశ్విన్ : మీరు చెప్పిన అందరూ అద్భుతమైన వ్యక్తులు. అందరు గర్వించదగ్గ గ్రేట్ యాక్టర్స్. వీరు చాలా హంబుల్ గా ఉంటారు. వారికి సినిమా అంటే ప్రేమ, ఇష్టం. వీరిలో వుండే సిమిలర్ క్వాలిటీ నా జర్నీ.

స్టూడెంట్ : కల్కి సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు ?

నాగ్ అశ్విన్ : అతి త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తాం. 

అయితే నాగ్ అశ్విన్ ట్రైలర్ రిలీజ్ అప్డేట్ చూసుకుంటే..2024 ఏప్రిల్ 1న ఆడియన్స్ ముందుకు రాబోతుంది.ఈ బిగ్ అప్డేట్ తో ప్రభాస్ ఫ్యాన్స్ ఖుషి అవుతూ..కల్కి ట్రైలర్ డేట్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.