ఎస్టీపీపీలో హైడ్రోజన్ ఉత్పత్తి

ఎస్టీపీపీలో హైడ్రోజన్ ఉత్పత్తి

జైపూర్, వెలుగు: సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్​లో హైడ్రోజన్ ఉత్పత్తిని ప్రారంభించామని ఈ అండ్ఎం డైరెక్టర్ సత్యనారాయణ రావు తెలిపారు. గురువారం జైపూర్​లోని ఎస్టీపీపీని సందర్శించిన ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ ఉత్పత్తిలో వేడెక్కిన కొన్ని యంత్రాలు చల్లబర్చడానికి హైడ్రోజన్ వాయువును వినియోగిస్తామని పేర్కొన్నారు. అందుకోసం ఎస్టీపీపీ ప్రాంగణంలో హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. 

చెన్నూరులో ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ కేంద్రాన్ని పరీశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఎస్టీపీపీ జీఎం బసివిరెడ్డి, పవర్ ప్రాజెక్ట్ డివిజన్ చీఫ్ విశ్వనాథ రాజు, సోలార్ జీఎం జానకి రాం తదితరులు పాల్గొన్నారు.