
రామ్ యోగి వెలగపూడి దర్శక నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘ఎవోల్’. సూర్య శ్రీనివాస్, శివ బొడ్డు రాజు హీరోలుగా జెనిఫర్ ఇమ్మానుయేల్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా దర్శక నిర్మాత రామ్ యోగి మాట్లాడుతూ ‘ఇద్దరు స్నేహితుల మధ్య అండర్స్టాండింగ్, నేపథ్యంలో సాగే కథ ఇది. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందించాం. ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా కూడా అందరికీ నచ్చుతుంది. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం’ అని చెప్పాడు. సునీల్ కశ్యప్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.