Akash Puri:పేరు మార్చుకున్నా..ఇకపై ఆకాష్ పూరి కాదు..ఇలా పిలవండి

Akash Puri:పేరు మార్చుకున్నా..ఇకపై ఆకాష్ పూరి కాదు..ఇలా పిలవండి

డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్(Puri Jagannadh) తనయుడు ఆకాష్ పూరి(Akash Puri) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం వరుస ఫెయిల్యూర్స్తో ఉన్న ఆకాష్ పూరీ తాజాగా తన పేరును మార్చుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపాడు.  ఇక నుంచి తనను ఆకాశ్‌ జగన్నాథ్‌ అని పిలవాలంటూ కోరారు. నేడు (జూలై 25న) తన పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆకాష్ ఇలా త‌న పేరును మారుస్తున్న‌ట్లు ప్రకటించాడు.

ఇంతకుముందు తండ్రి పేరు క‌లిసేలా ఆకాష్ పూరి అని ఉండ‌గా, ఇప్పుడు కొత్త పేరులోనూ తండ్రి పేరు జ‌గ‌న్నాధ్ కంటిన్యూ చేస్తున్నాడు. అయితే, తన పేరు మార్పుకు గల కారణాలు మాత్రం వెల్లడించలేదు. ఇక పేరు మార్చుకున్నాక అయిన, బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాలని పూరి ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. 

సినిమాల విషయానికి వస్తే.. చైల్డ్ ఆర్టిస్ట్ గా చిరుత మూవీతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన ఆకాష్ ఆ తరువాత ఆంధ్రపోరి సినిమాతో హీరోగా మారాడు. ఆ సినిమా ఆశించినంత విజయం సాదించకపోవడంతో తన తండ్రితో కలిసి మెహబూబా సినిమా చేశాడు. కానీ, ఆ సినిమా కూడా ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయింది. ఆ తరువాత వచ్చిన రొమాంటిక్, చోర్ బజార్ సినిమాలు కూడా డిజాస్టర్ గా మిగలడంతో కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు.