సుమ కొడుకు హీరోగా బబుల్‌‌‌‌గమ్.. పస్ట్ లుక్ రిలీజ్

సుమ కొడుకు  హీరోగా బబుల్‌‌‌‌గమ్.. పస్ట్ లుక్ రిలీజ్

నటుడు రాజీవ్ కనకాల, యాంకర్ సుమ కొడుకు రోషన్  హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘బబుల్‌‌‌‌గమ్’.  క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీల చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రవికాంత్ పెరేపు దీనికి దర్శకుడు.  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మహేశ్వరి మూవీస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. మానస చౌదరి హీరోయిన్‌‌‌‌. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌ను  దర్శకుడు రాజమౌళి సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. 

ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేస్తూ..  ‘నటుడిగా అరంగేట్రం చేసినందుకు రోషన్‌‌‌‌కు అభినందనలు. తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేయాలని,  రాజీవ్, సుమ గర్వపడే నటుడవ్వాలని కోరుకుంటున్నా’ అని పోస్ట్ చేశారు.  కర్లీ హెయిర్, గడ్డంతో రోషన్ అందంగా కనిపిస్తుంటే, ట్రెండీ లుక్‌‌‌‌లో మానస ఇంప్రెస్ చేస్తోంది. రోషన్ నోటిలో బబుల్‌‌‌‌గమ్‌‌‌‌తో ఉన్న ఈ పోస్టర్ ఆకట్టుకుంది. ఈ ఎక్సయిటింగ్ లవ్ స్టోరీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉందని చెప్పారు దర్శక నిర్మాతలు.  అక్టోబర్ 10న గ్లింప్స్ రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.  శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు.