మరో బేబీని దించుతున్న సాయి రాజేష్.. షూరూ చేసిన నాగ చైతన్య

మరో బేబీని దించుతున్న సాయి రాజేష్.. షూరూ చేసిన నాగ చైతన్య

బేబీ(Baby) దర్శకుడు సాయి రాజేష్(Sai rajesh) తన తరువాతి సినిమాను మొదలుపెట్టేశాడు. యంగ్ హీరో సంతోష్ శోభన్(Santhosh shobhan), ప్రముఖ యూట్యూబర్ దేత్తడి హారిక(Harika) హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ ప్రాజెక్టు కు సంబందించిన పూజ కార్యక్రమాలు నేడు  (అక్టోబర్30) ఫిలిం నగర్ లోని దైవ సన్నిధానంలో జరిగాయి. ఈ కార్యక్రమానికి అక్కినేని నాగ చైతన్య(Naga chaitanya) ముఖ్య అతిధిగా హాజరై చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఇదే విషయాన్నీ తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు నాగ చైతన్య. 

ఈ సందర్బంగా ఈ సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్ రిలీజ్ చేశాడు. సంతోష్ శోభన్, హారిక లీక్ మధ్య లిప్ లాక్ తో ఉన్న ఈ పోస్టర్ కు ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఇక ఈ పోస్టర్ పై.. కొన్ని ప్రేమ కథలు జీవిత కాలం వెంటాడుతాయి.. అనే ఎమోషనల్ క్యాప్షన్ ను ఇచ్చారు మేకర్స్. చూస్తుంటే ఈ సినిమా కూడా బేబీ సినిమాలా లవ్ అండ్ ఎమోషనల్ బ్యాక్డ్రాప్ గా రానుందని క్లియర్ గా అర్థమవుతోంది.  

Also Read :- కెరీర్,రిలేషన్,మెంటల్ హెల్త్ అన్నీ ఖరాబ్

ఇక ఈ సినిమాను దర్శకుడు  సాయి రాజేష్, ఎస్కేఎన్ సంయుక్తంగా నిర్మిస్తుండగా.. కొత్త దర్శకుడు సుమన్ పాతూరి తెరకెక్కించనున్నాడు. బేబీ సినిమాకు అద్భుతమైన సంగీతాన్ని అందించి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిన విజయ్ బుల్గానిన్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నాడు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా కూడా బేబీ సినిమాలా మంచి విజయం సాదిస్తుందా చూడాలి.