తెలుగులో ఇలాంటి చిత్రాలు అరుదు : సందీప్ రెడ్డి బండ్ల

తెలుగులో ఇలాంటి చిత్రాలు అరుదు : సందీప్ రెడ్డి బండ్ల

సుహాస్, సంగీర్తన జంటగా సందీప్ రెడ్డి బండ్ల తెరకెక్కించిన చిత్రం ‘జనక అయితే గనక’.  దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. అక్టోబర్ 12న సినిమా రిలీజ్ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘కొత్తగా పెళ్లైన జంటలు పిల్లలను కనడానికి ఎందుకంత ఆలోచిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితులేంటి అనే విషయాన్ని మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌లో చెప్పాం. ఓ వ్యక్తి కండోమ్ కంపెనీపై కేసు వేయడం అనే ఆలోచన నుంచి ఈ కథ పుట్టింది. విక్కీ డోనర్,  బదాయి హో తరహా ఔట్ ఆఫ్ ది బాక్స్ సినిమా ఇది.  

తెలుగులో ఇలాంటి చిత్రాలు అరుదు.  ‘ఏమైనా విశేషం ఉందా,  గుడ్ న్యూస్ ఎప్పుడు’ అని కొత్తగా పెళ్లైన వాళ్లను మన పెద్దవాళ్లు అడుగుతుంటారు. అది అడల్ట్ థీమ్ కాదు.  మా సినిమా కూడా అంతే.  జంధ్యాల గారు నా ఫేవరేట్ రైటర్.  ఆయన స్టైల్‌‌‌‌‌‌‌‌లో హెల్తీ హ్యూమర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో అందరూ చూసేలా ఉంటుంది. ఫ్యామిలీ ఆడియెన్స్ చూడలేని విధంగా ఈ  సినిమా తీస్తే దర్శకుడిగా నేను ఫెయిల్ అయినట్టే. నేను ఊహించిన దానికంటే గొప్పగా సుహాస్ ఇందులో పాత్రకు న్యాయం చేశారు. 

షూటింగ్ టైమ్‌‌‌‌‌‌‌‌లో తను తండ్రి అవడంతో ఎమోషనల్‌‌‌‌‌‌‌‌గానూ కనెక్ట్ అయ్యారు.  ఆడిషన్ చేసి సంగీర్తనను ఫైనల్‌‌‌‌‌‌‌‌ చేశాం.  తెలుగు కాస్త టచ్ ఉండడంతో డబ్బింగ్ కూడా ఆమెనే చెప్పింది.  దిల్ రాజు గారు ఎడిటింగ్, రీరికార్డింగ్ విషయాల్లో కొన్ని స‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌హాలు ఇచ్చారు.  స‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌దాగా న‌‌‌‌‌‌‌‌వ్వుకుంటూ, అక్కడక్కడా ఎమోష‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌ల్‌‌‌‌‌‌‌‌గా క‌‌‌‌‌‌‌‌నెక్ట్ అయ్యేలా ఉంటుంది. అన్ని వయసుల వాళ్లకి నచ్చుతుంది’ అని చెప్పాడు.